Ads
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో అడుగు పెట్టిన యువ నటులు కూడా ఒకటి, రెండు సినిమాల తరువాత స్టార్ హీరో హోదా సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, న్యాచురల్ స్టార్ నాని ఈ కోవలోకే వస్తారు. కానీ రామానాయుడి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రానా దగ్గుబాటి మాత్రం ఇంకా స్టార్ హీరో బేస్ సంపాదించుకోలేదనే చెప్పవచ్చు.
Video Advertisement
మంచి నటుడిగా రానాకు ఫుల్ మార్క్స్ పడ్డప్పటికీ, స్టార్ హీరో అనాలంటే ఆలోచించాల్సి వస్తుంది. అందుకు రానా సెలెక్ట్ చేసుకునే స్టోరీలే కారణంగా చెప్పవచ్చు.
మొదట లీడర్, కృష్ణం వందే జగద్గురం, ఘాజీ వంటి సినిమాలతో రానాకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వచ్చిన బాహుబలి వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అవ్వడంతో రానా బల్లాల దేవుడిగా అందరికి గుర్తుండిపోయాడు. ఇంత గుర్తింపు వచ్చిన తరువాత రానా కెరీర్ ని అద్భుతంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. పైగా బాబాయ్ అభిమానులు కూడా రానాకు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు. ఓన్ ప్రొడక్షన్ హౌస్ (సురేష్ ప్రొడక్షన్స్) కూడా ఉంది. వీటన్నింటికి తోడు రానా మంచి నటుడు, యాక్షన్ సీన్లను ఇరగదీస్తాడు అనే పేరుంది. సిక్స్ ప్యాక్ కలిగిన ఆరడుగుల రెండు అంగుళాల అందగాడు.
ఇన్ని విషయాలు అనుకూలంగా ఉన్నా కూడా రానా ఎప్పుడూ మంచి యాక్టర్ గానే ఉండిపోయాడు కానీ స్టార్ హీరో అనే పేరు సంపాదించుకోలేదు. రానా ఎంచుకునే కథలే దీనికి కారణంగా చెప్పవచ్చు. దీనివల్ల సినిమాలో నటుల గురించి ఎక్కువ ఊహించుకొని వెళ్తే కొన్నిసార్లు ప్లస్వ్చ్చు, కొన్నిసార్లు మైనస్ అవ్వచ్చు. విరాట పర్వం మూవీనే చూసుకుంటే.. సినిమా మొత్తం సాయి పల్లవే కనిపిస్తుంది. సాయి పల్లవి లేని సీన్ ఒక్కటి కూడా సినిమాలో లేదంటే నమ్మగలరా! మరి అలాంటప్పుడు రానా కోసం సినిమాకు వెళ్ళిన వాళ్ళకు నిరాశ తప్పదు. సినిమా ప్రమోషన్స్ అప్పుడు మా సినిమాలో పలానా గొప్పనటులు ఉన్నారని చెప్పడానికే కానీ రానాకు దీని వల్ల ఒరిగేదేం ఉండదు.
అయితే.. ఇప్పుడు ఈ విషయంలో రానా కూడా రియలైజ్ అయ్యాడా అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. మొన్న జరిగిన “విరాట పర్వం” లో రానా మాట్లాడిన మాటలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. విరాట పర్వం హీరో సాయి పల్లవి అని చెబుతున్నాడు రానా. “మరి రానా పాత్ర ఏమిటి? ఎప్పుడూ ఇలాంటి సినిమాలేనా అని అభిమానులు అడుగుతున్నారు.ఇకనుంచి ఇలాంటి సినిమాలు చేయను” అని రానా అన్నాడు. “ప్రయోగాలకు ఈ సినిమాతో చెక్ పెట్టేస్తాను” అంటూ రానా చెప్పాడు. రానా మాటలను బట్టి చూస్తే ఇక కెరీర్ లో ఏం చేయాలన్నది రియలైజ్ అయ్యాడు అని తెలుస్తుంది.
ఈ మాటల వెనుక.. విరాట పర్వం సినిమా ఎందుకు చేసానా అని అంతర్మథనం కూడా చెందుతున్నాడు అని టాక్ వినిపిస్తోంది. రానున్న రోజుల్లో రానా సినిమా సెలక్షన్ ఎలా ఉంటుంది, అది రానా కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.
End of Article