సినిమాల్లోకి రావాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అందుకోసం వారు పడే పాట్లు కూడా మాములుగా ఉండవు. సినిమాలో ఒక్క అవకాశం వస్తే చాలని.. తమని తాము ప్రూవ్ చేసుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అయితే.. టీవీలలో ప్రసారం అయ్యే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్.. లాంటి షో లు టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కొంత సహకరిస్తాయి.

jabardast artist ramu 1

ఈ షోలలో పార్టిసిపేట్ చేయడం, ఎంటర్టైన్ చేయడం ద్వారా ఎంతో కొంత నిలదొక్కుకుని పాపులారిటీ సంపాదించుకున్న ఆర్టిస్ట్ లు చాలా మందే ఉన్నారు. వారిలో అదిరే అభి టీం ఆర్టిస్ట్ రాము కూడా ఒకరు. జబర్దస్త్ లో తన కామెడీ ద్వారా నవ్వులు పూయిస్తూ.. వెండితెరపై కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో నాగార్జున గారు తనకు బాకీ ఉన్నారంటూ.. అసలేమి జరిగిందో చెప్పుకొచ్చారు.

Akkineni Nagarjuna

ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ కు ఆడిషన్ కు వెళ్లారు. ఐతే, సెలెక్ట్ కాకపోవడం తో.. అక్కడే ఓ పక్కన కూర్చుని బాధపడుతున్న టైం లో నాగార్జున వచ్చారట.. ఆయన అక్కడే ఎవరికోసమో చూస్తుండగా.. అక్కడ బాయ్స్ ఎవరు రాలేదని అనుకున్న రాము వెళ్లి ఆయనకు ఒక సిగరెట్, కూల్ డ్రింక్ ను తీసుకొచ్చి ఇచ్చారట. అయితే డబ్బులు తీసుకోకుండానే తెచ్చి ఇచ్చారట.

jabardast artist ramu 2

ఆయనతో ఉండి.. తన అవకాశం గురించి కూడా అడిగితె.. పనైపోతుంది.. తనకు కూడా సినిమాల్లోకి వెళ్ళడానికి ఒక అవకాశం వస్తుంది కదా అని భావించి రోజంతా అక్కడే ఎదురు చూశాడట. సాయంత్రం అయ్యే సరికి అక్కడ వేరేవాళ్లని నాగార్జున గారి గురించి అడగగా.. ఆయన అసలు షూటింగ్ కె రాలేదని.. ఇందాక వచ్చింది ఆయన డూప్ అని చెప్పారుట. దీనితో జబర్దస్త్ రాము షాక్ అయ్యి.. ఇక చేసేదేమి లేదని అనుకున్నారు. ఆయన ఈ అనుభవాన్ని ఫన్నీ గా పంచుకున్నారు. ఇంకా.. జబర్దస్త్ ఆర్టిస్ట్ రాము పంచుకున్న విషయాలను ఈ కింద వీడియో లో చూడొచ్చు.

Watch Video: