బిగ్ బాస్ షో మొదలైంది ప్రతి సీజన్ లో ఉన్నట్టే ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆడియన్స్ కి ఏ కంటెస్టెంట్ ఎలాంటి వారు అనే క్లారిటీ వచ్చేస్తుంది. దాన్నిబట్టి ఎలిమినేషన్, ఇంకా సేవ్ చేయడం అనేవి ఉంటాయి. మనం చూస్తూ ఉండగానే సీజన్ ఎండ్ కూడా అయిపోతుంది. ప్రతి సీజన్ మొదలవడానికి, అయిపోవడానికి మధ్యలో ఇంకొకటి కూడా ఉంటుంది, అదే వైల్డ్ కార్డ్.అందరు కంటెస్టెంట్స్ కి ఒకళ్ళకి ఒకళ్ళు అలవాటైపోయిన సమయంలో అప్పుడు షో లోకి ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

ఇదే వారంలో రెండో  వైల్డ్ కార్డ్ ఎంట్రీ సిద్ధం చేశారు.తాజా ప్రోమోలో హౌస్ లోకి కొత్తగా ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా లోపలి వచ్చిన ఆ వ్యక్తి తనను తాను జోకర్ గా చెప్పుకుంటూ పరిచయం చేసుకోవడం కనిపించింది. జబర్దస్త్ అవినాష్ మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది.

 

అలాగే హారిక టీం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది చూస్తే ఇక అతను ఖచ్చితంగా ముక్కు అవినాష్ అని నెటిజన్లు భావిస్తున్నారు..అంద‌ర్ని న‌వ్వించే జోక‌ర్ పాయింట్‌తో వ‌స్తున్నాడు అంటే అది క‌చ్చితంగా ముక్కు అవినాష్ అయ్యుంటుంది.మొదటి వీక్ నామినేషన్ లో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు.