Ads
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో.. హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసిన కేశవ పాత్రకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఈ క్యారెక్టర్ చేసింది నటుడు జగదీష్ ప్రతాప్ బండారి. తాజాగా జగదీష్ ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా వచ్చింది. అదే ‘సత్తి గాని రెండు ఎకరాలు’. ఈ సినిమా ఆహాలో మే 26న విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
- చిత్రం : సత్తిగాని రెండు ఎకరాలు
- నటీనటులు : జగదీష్ ప్రతాప్ బండారి, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, మురళీధర్, రాజ్ తిరందాసు, అనీష్ దామ
- నిర్మాత : నవీన్ యర్నేని, వై రవిశంకర్
- దర్శకత్వం : అభినవ్ దండా
- సంగీతం : జై క్రిష్
- విడుదల తేదీ : మే 26, 2023
- ఓటీటీ వేదిక : ఆహా
స్టోరీ :
కొల్లూరు అనే గ్రామంలో సత్తి(జగదీష్ ప్రతాప్ బండారి) అనే వ్యక్తి ఉంటాడు. ఎంత కష్టం వచ్చినా.. ఉన్న రెండు ఎకరాలు అమ్మవద్దని అతడికి తాత చిన్నప్పుడే చెబుతాడు. ఆ మాటలు సత్తికి అలాగే గుర్తుంటాయి. పెద్దై పెళ్లి చేసుకుంటాడు. సత్తికి ఓ కొడుకు, కుమార్తె ఉంటారు. కుమార్తెకు గుండె జబ్బు ఉంటుంది. వైద్యం చేయించాలంటే చాలా డబ్బులు కావాలి. తనకు దగ్గరి చుట్టమైన సర్పంచ్(మురళీధర్) దగ్గర కొన్ని డబ్బులు అడుగుతాడు సత్తి.
అయితే అతడి పొలం పక్కనే ఉన్న సత్తి రెండు ఎకరాల పొలం కొనుగోలు చేస్తే.. ఓ కంపెనీకి అమ్మేయోచ్చనే ఆలోచనలో ఉంటాడు. ఓ రోజు సత్తి సైకిల్ మీద వెళ్తుంటే.. అతడి పక్క నుంచే వెళ్లిన ఓ కారు.. చెట్టు ఢీ కొడుతుంది. ఇది చూసిన సత్తి కారు దగ్గరకు వెళ్తాడు. అయితే అందులోని సూట్ కేస్ మాత్రమే తీసుకొస్తాడు. అందులో డబ్బులు ఉంటె కూతురికి ఆపరేషన్ చేయించొచ్చు అనుకుంటాడు..
ఇంతకీ ఆ సూట్ కేసు లో ఏముంది.. సత్తి రెండు ఎకరాలు అమ్మేశాడా? సత్తి కుమార్తెకు ఆపరేషన్ అయిందా? ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర ఏమిటి..లాంటి విషయాలు తెలియాలంటే సత్తి గాని రెండు ఎకరాలు సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
ఈ మధ్య కాలంలో ప్రాంతీయ సినిమాలు, కంటెంట్ ఉన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇదే కోవలో సత్తిగాని రెండు ఎకరాలు సినిమాను తీశారు. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఎలా కుటుంబ పెద్ద సతమతమవుతాడో ఈ సినిమాలో చూపించారు. జగదీశ్ ప్రతాప్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అతడికి తోడుగా రాజ్ తిరందాసు యాక్టింగ్ కూడా ప్లస్ పాయింట్. పెద్ద పెద్ద లొకేషన్స్ జోలికి పోకుండా.. ఒక్క ఊరి చుట్టే కథను తిప్పాడు దర్శకుడు. సినిమా ఎండ్ పాయింట్ చూస్తే.. సీక్వెల్ కూడా ఉందని అర్థమవుతుంది.
ప్రతి పాత్ర పరిధి మేరకు నటించారు. వారి నటన.. కథ, కథనం చాలా సహజం గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.. కొన్ని కొన్ని సీన్లలో పనితనం కనిపిస్తుంది. స్టోరీ పాయింట్ బాగుంది కానీ.. కథనం చాలా స్లో గా ఉంటుంది. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. మ్యూజిక్ మీద ఇంకాస్త ఫోకస్ చేస్తే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పర్ఫార్మెన్స్
- స్టోరీ పాయింట్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- మ్యూజిక్
- సాగదీసినట్టుగా అనిపించే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
2 .5 /5
ట్యాగ్ లైన్ :
ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ‘సత్తిగాని రెండెకరాలు’ లో కామెడీ ఎంజాయ్ చేయవచ్చు.
watch trailer :
End of Article