దర్శకుడు వంశీ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ, కళ్యాణి హీరోహీరోయిన్లుగా నటించారు. డైరెక్టర్ వంశీ చాలా కాలం విరామం తరువాత దర్శకత్వం చేసిన చిత్రం ఇది.

Video Advertisement

వంశీ ఈ చిత్రం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. ఆ విషయం ఈ మూవీ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఈ చిత్ర విజయంలో దర్శకుడు వంశీ పాత్ర ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ చిత్ర కాన్సెప్ట్ తో పాటు సంగీత దర్శకుడు చక్రి అందించిన మ్యూజిక్, పాటలు రవితేజ, కళ్యాణి ల నటన, హాస్య సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్కటి ఈ చిత్ర విజయానికి కారణం అయ్యాయి. ఈ అందమైన ప్రేమకథలో ముందుగా హీరోగా అనుకున్నది రవితేజని కాదంట. డైరెక్టర్ వంశీ ఈ చిత్రంలో స్టార్ హీరోగా పెట్టాలని అనుకున్నారట. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
దర్శకుడు వంశీ ఈ సినిమాలో హీరోగా జగపతి బాబుని తీసుకోవాలని భావించారు. అప్పటికే ఫ్యామిలీ హీరోగా పాపులర్ అయిన జగపతి బాబు దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారంట. కథ విన్న జగపతి బాబు కారణం ఏమిటో కానీ, ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.
ఆ తరువాత వంశీ రవితేజకు కథ చెప్పి, ఒప్పించారు. హీరోయిన్ గా కళ్యాణిని తీసుకున్నారు. అలా తెరకెక్కిన సినిమా సూపర్ హిట్ గా నిలిచి,  డైరెక్టర్ వంశీని తిరిగి సినిమాలు చేయడానికి ఆయనకి నమ్మకాన్ని ఇచ్చింది. వంశీ తాను రాసుకున్న కథని అలాగే స్క్రీన్ మీద చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అయితే  ఈ చిత్రం తరువాత ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదనే చెప్పవచ్చు. అలా ఆయన సినిమాలను చేయడం మెల్లిగా తగ్గించారు.  Also Read: ఆ రోజుల్లోనే సొంతహెలికాప్టర్‌ ఉండేదంట.. అలనాటి హీరోయిన్ కేఆర్‌ విజయ ఎలా ఉందో? ఎక్కడ ఉందో తెలుసా?