ఇప్పటి హీరోయిన్లతో పోల్చుకుంటే అప్పట్లో హీరోయిన్లు ఎక్కువ మంది తమ కెరీర్ ను సరిగా ప్లాన్ చేసుకోలేక, కొంతమంది సంపాదించిన దానిని సరిగ్గా ఉపయోగించక పోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఆరోజుల్లోనే కెరీర్ ను సంపాదనను కూడా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లారు. అలాంటి వారిలో సినియర్ నటి కేఆర్ విజయ ఒకరు.

Video Advertisement

ఆరోజుల్లో కేఆర్ విజయ బాగా పాపులర్ హీరోయిన్. నటుడు జెమినీ గణేషన్ ప్రోత్సాహం వల్ల ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అలా వచ్చిన విజయకు మళ్ళీ వెను తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆమె తరువాటి తరం హీరోల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఆమె అగ్ర హీరోలకు తల్లిగా నటించారు. ముఖ్యంగా దేవత పాత్రలో అనేక సినిమాలలో నటించి మెప్పించారు. ఇప్పటికి దేవత పాత్ర అంటే మొదట గుర్తొచ్చేది కేఆర్ విజయ.
దాదాపు అప్పటి అగ్ర హీరోలందరికి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరావు, సీనియర్‌ ఎన్టీఆర్‌,  సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోల సరసన నటించారు. ఆమె స్టార్‌ హీరోయిన్ గా ఉన్నసమయంలోనే  పెద్ద వ్యాపావేత్తను వివాహం చేసుకుని, సెటిలయ్యారు. పెళ్లి తరువాత ఆమె మహారాణి వంటి జీవితాన్ని గడిపారు. ఆమె భర్త  వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, ఆమెకు అప్పట్లోనే సొంత హెలికాప్టర్‌ కూడా ఉండేది.
దానిని కేఆర్ విజయ భర్తే నడిపేవారట. ఆమెకి ఎక్కడ మూవీ షూటింగ్స్‌ ఉన్నా తన సొంత హెలికాప్టర్‌లోనే వెళ్ళి వచ్చేవారంట. అయితే ఆరోజుల్లో స్టార్ హీరోలకు సైతం సొంత హెలికాప్టర్‌ లేవు. ఇక ఆమె భర్తకు ఎన్నో రకాలు వ్యాపారాలు ఉండేవని, దాంతో మద్రాస్‌ దగ్గరలో 67 ఎకరాల తోట కొన్నారు. అంతేకాకుండా కేఆర్ విజయ రాజభవనం వంటి ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నారట. ఆ ఇంటి పై భాగంలోహెలికాప్టర్‌ ఆగేదంట. విజయ వైభోగం గురించి సినీ పరిశ్రమలో అంతా చెప్పుకునేవారంట. ఆమె ఇంటిలో స్విమ్మింగ్ పూల్‌ వంటి ఆధునిక వసతులు ఉండేవట. అవన్నీ చూసి అప్పట్లో అగ్ర హీరోలు ఎంతో ఆశ్చర్యపోయేవారట.కేఆర్‌ విజయ భర్త మరణాంతరం కుమార్తెతో కలిసి చెన్నైలో జీవిస్తోంది. అయితే ఆమె గతంలో ఒక యూట్యూబ్‌ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయలన్నీటిని ఆమె స్వయంగా  చెప్పింది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.Also Read: మిగిలిన హీరోలు చేస్తే లేనిది… “మహేష్ బాబు” చేస్తే మాత్రం ఎందుకు వచ్చింది..?