Ads
కొన్ని సినిమాలు అలా మెరుపు తీగలా వచ్చి వెళ్లిపోతుంటాయి. అసలు అలాంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు అలాంటి కోవకు చెందిందే జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి సినిమా వచ్చి చేరింది.
Video Advertisement
అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో ఎంమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. అయితే అంతకముందు అజయ్ సామ్రాట్ బాహుబలి సినిమాకి రైటర్ గా చేశారు. ఇక ఈ సినిమా జులై 7న థియేటర్లలో విడుదల అయినప్పటికీ… పెద్దగా కలెక్షన్లు రాలేదు. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలో విడుదల అయ్యింది.
అయితే ఈ సినిమా కథ కొత్తగా లేకపోవడంతో పెద్దగా ప్రేక్షకులను చేరలేక పోయింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ఈవెంట్ లో ప్రమోషన్స్ లో హరీష్ రావు తదితర పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమా అంతా దొరల కాలంలో ఉండే సన్నివేశాలను ఉద్దేశిస్తూ రూపొందించారు. కాబట్టి ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేక పోయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో జగపతి బాబు భీమ్ రావ్ దేశ్ ముఖ్ అనే దొర పాత్రలో నటించగా, ఆయన సతీమణులుగా విమలారామన్ మీరాబాయి గా, మమతా మోహన్ దాస్ జ్వాలాబాయి గా నటించారు.
అయితే తెలంగాణ గఢీలు, దొరల నేపథ్యంలో తెరేకెక్కిన ఈ సినిమాలో … భీమ్ రావ్ దొర ఒక రుద్రాంగిపై కన్నేశాడు. వశపరుచుకోవాలని ప్రయత్నిస్తుండగా… దొరను అడ్డుకోవడానికి ఒకతను వస్తాడు. అతనెవరు? రుద్రాంగి కి ఏమవుతాడు అనే సారాంశంలో ఈ కథ నడుస్తుంది. మొత్తంగా ఈ సినిమా థియేటర్లలో పెద్దగా హిట్ ఇవ్వకపోయినా ఒక ప్రయోగం ఇప్పుడు ఓటీటీలో ఎలా నడుస్తుందో చూడాలి మరి.
End of Article