అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా పుష్ప..ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. బాలీవుడ్ లో కూడా వంద కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. దీంతో ఈ చిత్ర రెండో భాగం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

 

ఇటీవలే ఈ సినిమా రెండో పార్ట్ షూటింగ్ ప్రారంభమైనట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి. పక్కా షెడ్యూల్స్ తో… మొదటి భాగం కంటే మించి సినిమా ఉండే రీతిలో సెకండ్ పార్ట్ షూటింగ్ పగడ్బందీగా కంప్లీట్ చేస్తున్నాడు డైరెక్టర్. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో ‘ఊ అంటావా మావా..’ స్పెషల్ సాంగ్ ప్రపంచ సినీ రంగాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ పాటల సమంత వేసిన స్టెప్పులు థియేటర్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

jahnvi kapoor is the option for special song in pushpa 2..

అలాగే ఈ రెండో పార్ట్ లో కూడా మంచి స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసారంట దేవి అండ్ సుకుమార్. దీని కోసం శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ని పుష్ప టీం సంప్రదించినట్లు సమాచారం. మొదటి పార్ట్ కి ‘ఊ అంటావా మావా..’ సాంగ్ లో స్పెషల్ స్టెప్పులు వేసిన సమంతకి ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పుష్ప క్రేజ్ కూడా బేరీజు వేసుకుని జాన్వి కపూర్ …పుష్ప సెకండ్ పార్ట్ లో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

jahnvi kapoor is the option for special song in pushpa 2..

అంతే కాకుండా జాన్వీ కపూర్‌ ఎప్పటినుంచో తెలుగులో నటించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యం లో వచ్చిన ఈ అవకాశానికి ఆమె పాజిటివ్ గానే రియాక్ట్ అయిందని టాక్. మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా సినిమాలో కూడా జాన్వీ కపూర్ ఆఫర్ పట్టేసిందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది తెలుగు తెరపై జాన్వీ కపూర్ మార్క్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.