“జల్సా” సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ కి తగ్గ సినిమా కాకపోయినా… ఓ మధ్యతరగతి కుర్రాడు తన లైఫ్ లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటు ముందుకు సాగాడు అన్న పాయింట్ చుట్టూ త్రివిక్రమ్ అల్లిన కథ ఇది. అప్పట్లో “ఖుషి” సినిమా ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా తరువాత పవన్ దాదాపు ఫెయిల్యూర్స్ నే చవి చూసాడు. మొత్తం 5 సినిమాలు వరసగా ప్లాప్ అయ్యాయి.

jalsa 1

కానీ.. పవన్ కు ఉన్న ఇమేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. అలాంటి టైం లో వచ్చింది జల్సా.. అప్పట్లోనే రికార్డులను తిరగరాసేసింది.ఏప్రిల్ 2 , 2008 లో జల్సా రిలీజ్ అయింది. పవన్ అభిమానులందరినీ ఉర్రుతలూపేసింది. ఈ సినిమా కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. అప్పట్లో ఈ పాటలు ఒక ఊపు ఊపాయి. ఇప్పటికే.. ఈ సినిమా పాటలు మోగుతూనే ఉంటాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. మొత్తం 12 రికార్డులను సృష్టించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

jalsa 2

#1 ఆడియో రిలీజ్ జరగకుండానే… ఈ సినిమా నుంచి 3 పాటలు ఇంటర్నెట్ లో లీక్ అయిపోయాయి. అంతే కాదు అవి సూపర్ హిట్ అయిపోయాయి కూడా..

#2 ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా చేసారు. ఫాన్స్ కి కూడా పాస్ లు ఇచ్చి ఫంక్షన్ లో కూర్చోపెట్టడం ఈ సినిమా నుంచే స్టార్ట్ అయింది.

jalsa 3

#3 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే ట్రెండ్ కూడా ఈ సినిమా నుంచే మొదలైంది.

#4 కేవలం ఆడియో సీడీ లతోనే “జల్సా” కోటి రూపాయలు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.

#5 బాలీవుడ్ స్టార్ ర్యాప్ సింగర్ బాబా సెహగల్ ను దాదాపు 12 సంవత్సరాల తరువాత తెలుగు ఇండస్ట్రీ కి తీసుకొచ్చిన సినిమా “జల్సా”.. గతం లో బాబా సెహగల్ చిరంజీవి “రిక్షావోడు” సినిమాలో “రూపు తేరా మస్తానా” అనే పాటని కూడా పాడారు.

jalsa 5

#6 నైజాం ప్రాంతం లో “జల్సా” సినిమా 9.10కోట్ల షేర్ ను సాధించి అప్పట్లో తిరుగులేని రికార్డు నెలకొల్పింది.

#7 “జల్సా” సినిమా ప్రపంచ వ్యాప్తం గా వెయ్యి స్క్రీంలపై రిలీజ్ ఐన మొట్టమొదటి సినిమా.

#8 “గాల్లో తేలినట్టుందే..” అనే ఒక్క పాటకోసమే కోటి రూపాయలు ఖర్చు చేసి సెట్ వేశారు. అప్పట్లో ఇది ఓ సెన్సేషన్ గా నిలిచింది.

jalsa 6

#9 దాదాపు 282 థియేటర్స్ లో యాభై రోజుల పాటు నిరవధికంగా ఆడింది “జల్సా” సినిమా.

#10 పవర్ స్టార్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇలా ఒక హీరో కి మరో హీరో వాయిస్ ఓవర్ ఇచ్చే ట్రెండ్ కూడా “జల్సా” తోనే మొదలైంది.

jalsa 4

#11 ఓవర్సీస్ నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ ను ఈ సినిమా రాబట్టగలిగింది.

#12 ప్రసాద్స్ లో 85 లక్షల కలెక్షన్ రాబట్టిన మొదటి సినిమా గా జల్సా నిలిచింది.