Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. కొద్ది సేపటి క్రితమే ఆర్ ఆర్ ఆర్ నుంచి జనని సాంగ్ విడుదల అయ్యింది.
ఈ పాట కోసం చాలానే కష్టపడ్డాం అని ఆర్ ఆర్ ఆర్ యూనిట్ చెప్పుకున్న సంగతి విదితమే. ఈ పాట ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. సోషల్ మీడియాలో జనని సాంగ్ హవా మొదలైంది. విడుదల అయిన కొద్దిసేపటికే.. ఈ పాట ట్రేండింగ్ లో నిలుస్తోంది.
End of Article