Ads
2018లో ధడక్ మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తనకు వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటు మంచి పేరు సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారిలో జాన్వీ కపూర్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోత లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది మన అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ముద్దుల తనయ జాన్వీ కపూర్.
Video Advertisement
సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉన్న, ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఈ విషయమే జాన్వీకి తలనొప్పిగా మారింది. ఒక విషయం పై జాన్వీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ విషయం ఏంటో చూద్దాం రండి.
జాన్వీ తాజాగా “గుడ్ లక్ జెర్రీ” అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ లో జాన్వీ కపూర్ నటన అందరినీ మెప్పించిన, జాన్వీ కి మాత్రం మంచి గుర్తింపు రాలేదని చెప్పవచ్చు. గుడ్ లక్ జెర్రీ చిత్ర ట్రైలర్ ను చూసిన నెటిజన్లు సైతం మన తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతారతో పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ కి జాన్వీ బాగా హర్ట్ అయినట్లు ఉంది. మీ ఆదరణ నాకు నచ్చింది. కాని నన్ను ఒకరితో పోల్చడం అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంది.
ఆమె దక్షిణాదిలో ఒక సక్సెస్ ఫుల్ హీరోయిన్ అని నాకు తెలుసు. నిజంగా చెప్పాలంటే ఈ కంపేరిజన్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. కేవలం ఆమె నటించిన కోలమావు కోకిల చిత్రాన్ని నాతో రీమేక్ చేస్తున్నారు మూవీ మేకర్స్. దీనికి గాను మీరు నన్ను నయనతారతో పోవడం అనేది నాకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ కి సమాధానమిచ్చింది జాన్వీకపూర్. నయనతార నటించిన కోలమావు కోకిల రీమేక్ నే జాన్వీ నటిస్తున్న చిత్రం గుడ్ లక్ జెర్రీ. ఇప్పుడు జాన్వీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
End of Article