తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఈమె ఎప్పటి నుంచో టాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది కానీ ఇప్పటివరకు దానికి ముహూర్తం కుదర్లేదు.

Video Advertisement

 

అయితే ఎన్టీఆర్30 సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ తీస్తున్న ఈ చిత్రం లో ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా నటించేందుకు ఆసక్తిగా ఉందని గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పిన జాన్వీ.. ఎన్టీఆర్ 30 సినిమాలో భాగం కావడానికి డేట్స్ అడ్జస్ట్ చేసుకొని మరీ సిద్దమైందట. అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా సెట్స్ పై జాన్వీ ఉండబోతుందని సమాచారం.

janhvi kapoor conditions to producers..!!

అయితే ఈ చిత్రానికి జాన్వీ కపూర్ 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. అంతే కాకుండా నిర్మాతలకు పలు కండీషన్స్ పెడుతోందట ఈ బ్యూటీ. జాన్వీ కపూర్ షరతులు విన్న నిర్మాతలు ఈమెతో సినిమాలు తీయడం తేలిక కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఎడిటింగ్ లో తన సీన్లను కట్ చేయకూడదని షరతు విధిస్తున్నారని తెలుస్తోంది. తాను సినిమాకు ఓకే చెప్పిన తర్వాత స్క్రిప్ట్ లో కానీ, క్యారెక్టర్ లో కానీ మార్పులు చెప్పకూడదని ఆమె చెబుతున్నారని బోగట్టా.

janhvi kapoor conditions to producers..!!

దీంతో జాన్వీ కపూర్ తో సినిమా చేసే ముందు నిర్మాతలు చాలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ షరతులకు ఒప్పుకుని సినిమాలను తీసే నిర్మాతలు ఉంటారా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అలియాభట్ పాత్రని కత్తిరించిన నేపథ్యం లోనే జాన్వీ ఈ కండీషన్స్ పెడుతున్నట్లు సమాచారం. రెమ్యూనరేషన్ విషయంలో కూడా జాన్వీ తగ్గట్లేదని తెలుస్తోంది.