ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా జవాన్ పేరే వినిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించిన మూవీ ‘జవాన్’.
Video Advertisement
బాలీవుడ్ లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల కలెక్షన్లు సాధించి, సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే సౌత్ ప్రేక్షకులు మాత్రం ఈ మూవీ పై పలు సినిమాలను మిక్స్ చేసి తీసినట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అయితే అట్లీ ఆ తెలుగు సీరియల్ ను కాపీ చేశారని అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
షారుక్ ఖాన్, నయనతార తొలిసారిగా జంటగా నటించిన జవాన్ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందని అంటున్నారు. నార్త్ ఆడియెన్స్ అయితే అట్లీ మేకింగ్, షారుక్ అద్భుతమైన నటనకు ఫిదా అయ్యారు. మొదటిరోజే వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టి పఠాన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఈ సినిమా పై ఆడియెన్స్ తో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు బెస్ట్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో షారుక్ ఫ్యాన్స్ సంతోషానికి అవధు లేకుండా పోయాయి.
అయితే ఈ మూవీకి అంత రెస్పాన్స్ సౌత్ నుండి రావడం లేదని చెప్పవచ్చు. దానికి కారణం ఇలాంటి సినిమాలను ఇప్పటివరకు దక్షిణాది ఆడియెన్స్ ఎన్నో చూశారు. దాంతో వారికి నాలుగు అయిదు సినిమాలను కలిపి తీసినట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ ఆడియెన్స్ కి మాత్రం ఇది సరికొత్తగా ఉంది. అట్లీ మాస్ స్టైల్ టేకింగ్ లో షారుక్ ను సరికొత్తగా చూపించడంతో ఫ్యాన్స్ థ్రిల్ ఫిల్ అవుతున్నారు.
ఈ మూవీ పఠాన్ లాగే వెయ్యి కోట్ల వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే కొందరు ఈ మూవీని తెలుగులో హిట్ అయిన బుల్లితెర సీరియల్ ‘మొగలిరేకులు’ తో పోలుస్తున్నారు. ఆ సీరియల్ నుండి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాపీ, చేసారని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: “బిగ్‌బాస్ తెలుగు” ఫైనలిస్ట్ జవాన్ సినిమాలో నటించారా..? ఎవరంటే..?