స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో రూపొందిన ఈ సినిమాని నీలిమ గుణ నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14 న విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం పై ఇప్పటికే భరో అంచనాలు ఏర్పడ్డాయి. సమంత తన కెరీర్ లో మొదటిసారిగా పౌరాణిక సినిమాలో నటించారు.

Video Advertisement

గత కొంతకాలంగా హీరోయిన్ సమంత రొటీన్ సినిమాలను కాకుండా డిఫరెంట్ జానర్ సినిమాలను చేస్తూ ఆడియెన్స్ ని అలరిస్తోంది. ఇందులో తెలుగు నటీనటులు మత్రమే కాకుండా ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా ఉన్నారు. మహాభారతంలోని మహాకవి కాళిదాసు రాసిన ఆభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శకుంతలగా సమంత నటించగా, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు.
shakuntala-samantha-vs-jayaprada1 ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్‌,సీనియర్ హీరోయిన్స్ మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల, సచిన్‌ ఖేడ్కర్‌, కబీర్‌ బేడీ, వర్షిణీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె ‘అల్లు అర్హ’ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షోలు కూడా వేశారు. ఈ మూవీ ప్రీమియర్ చూసిన ఆడియెన్స్ సమంత శకుంతలగా చాలా నాచురల్ గా నటించిందని మెచ్చుకుంటున్నారు.
shakuntala-samantha-vs-jayaprada2 అయితే సోషల్ మీడియాలో కొందరు శకుంతలగా సమంత కన్నా, అలనాటి హీరోయిన్ జయప్రద బాగా నటించిందని, నిజంగా శకుంతల అంటే ఆమెలా ఉండాలని కామెంట్స్, పొస్ట్ పెడుతున్నారు. హీరోయిన్ జయప్రద ‘కవిరత్న కాళిదాసు’ అనే కన్నడ సినిమాలో శకుంతలగా నటించింది. దుష్యంతుడి పాత్రలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించారు. ఆ సినిమాకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘శాకుంతలం’ సినిమాలో నటించిన సమంతతో పొలుస్తున్నారు.

Also Read: బలగం “లచ్చవ్వ” ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు .. వైరల్ అవుతున్న ఫోటోలు..!