Ads
ఐపీఎల్ 13 లో మూడవ మ్యాచ్ నిన్న అంటే సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ కి రాజస్థాన్ రాయల్స్ కి మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగులు చేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. టామ్ కర్రాన్ వేసిన ఆఖరి ఓవర్ లో వరుసగా మూడు సిక్స్ లు కొట్టారు మహేంద్ర సింగ్ ధోనీ. అందులో ఒక సిక్స్ 92 మీటర్ల దూరం వెళ్లి బాల్ స్టేడియం బయట పడింది.
Video Advertisement
ఈ మ్యాచ్ లో ధోని 17 బంతుల్లో 29 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ 32 బంతుల్లో 74 (1×4, 9×6), స్టీవ్ స్మిత్ 47 బంతుల్లో 69 (4×4, 4×6), జోఫ్రా ఆర్చర్ 8 బంతుల్లో 28 నాటౌట్ (4×6) స్కోర్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడిన డుప్లెసిస్ (37 బంతుల్లో 72, 1×4, 7×6) స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 17 సిక్స్ లు కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 16 సిక్స్ లు కొట్టింది. మ్యాచ్లో ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఆర్చర్.
ఎంగిడీ 30 పరుగులు ఇచ్చుకున్నాడు. 4 సిక్సులు, 2 నో బాల్స్, ఒక వైడ్ కలిపి మొత్తం 30 పరుగులు అయ్యాయి.
watch video:
— Cow Corner (@CowCorner9) September 22, 2020
End of Article