Ads
సాధారణంగా ఏదైనా చట్టపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆశ్రయించే వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకరు పోలీస్, ఇంకొకరు లాయర్. ఆ తర్వాత ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చే వ్యక్తి జడ్జ్. జడ్జ్ అనగానే మనకు సాధారణంగా కోర్టులో బ్లాక్ కోట్ వేసుకొని కూర్చున్న వ్యక్తి గుర్తొస్తారు.
Video Advertisement
కానీ కేరళలో పొంకున్నంలో మాత్రం జడ్జ్ అంకుల్ దగ్గరికి వెళ్లి ప్రజలు తమ ఇబ్బందులను చెప్పుకుంటారు. జడ్జ్ అంకుల్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక గుడి. అవును మీరు విన్నది నిజమే. మలయాళంలో జడ్జ్ అమ్మవన్ అని అంటారు. దీని వెనకాల ఒక కథ ఉంది. అదేంటంటే 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ లో గోవింద పిళ్ళై అనే జడ్జ్ నివసించేవారు. ఆయన ఎంతో మేధావి.
అయితే ఒకసారి ఆయన తన సొంత మేనల్లుడికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు అమలు అయిన తర్వాత ఆయన తప్పు చేశాను అని గ్రహించారు. దాంతో అపరాధ భావంతో గోవింద పిళ్ళై రాజు దగ్గరికి వెళ్లి తన తప్పు చేసినందుకు తీర్పు చెప్పమని కోరారు. దాంతో గోవింద పిళ్ళై తన పాదాలను కత్తిరించి అక్కడ ఉన్న చెట్టు కి వేలాడదీయమని కోరారు. తనని అలాగే మూడు రోజులు చెట్టుకి కట్టేసి ఉంచాలి అని కూడా కోరారు.
చట్టం కంటే ఎవరు ఎక్కువ కాదు అని అందరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. నెలలు గడిచిన తర్వాత గోవింద పిళ్ళై ఆత్మ ఆ ప్రాంతంలో సంచరిస్తోంది అనే పుకార్లు వ్యాపించాయి. ఆయన ఆత్మ ఒక రాయిలో నిర్బంధించబడింది అని అన్నారు. దాంతో తర్వాత ఎంతో మంది భక్తులు ఆ జడ్జి ఆశీర్వాదం కోరడానికి వచ్చేవారు.
ముఖ్యంగా చట్టపరమైన విషయాలకు తీర్పు అవసరమైనప్పుడు జడ్జ్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. సాధారణ వ్యక్తులు మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ జడ్జి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. వారిలో ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు అలాగే క్రికెటర్ శ్రీశాంత్, అంతే కాకుండా కొత్తగా నియమించబడిన జడ్జ్ లు కూడా వారు ఛార్జి తీసుకునే ముందు వెళ్లి జడ్జ్ అంకుల్ ని దర్శించుకుంటారు.
sourced from : The News Minute
End of Article