ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలోని‌ “చీమ చీమ” పాట కి జపాన్ జంట డ్యాన్స్ ఇరగదీసింది

ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలోని‌ “చీమ చీమ” పాట కి జపాన్ జంట డ్యాన్స్ ఇరగదీసింది

by Anudeep

Ads

2003లో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన బాక్సాఫీసు చిత్రం ‘సింహాద్రి’  ఈ కథను రాజమౌళి తండ్రి వి.విజేంద్ర ప్రసాద్ రాయగా, డైలాగ్స్ ఎం.రత్నం రాశారు.విజయ మారుతీ క్రియేటివ్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో కథానాయికలుగా భూమిక చావ్లా, అంకితలు నటించారు. ఎన్టీఆర్‌కి ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌ చిత్రంగా నిలిచింది.ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహాద్రి’ సినిమాలోని చీమ చీమ పాట కి జపాన్ జంట డ్యాన్స్ ఇరగదీసింది. ఈ పాటకు ఎన్టీఆర్,అంకిత చేసిన డ్యాన్స్ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.తాజాగా ఈ పాటకు ఓ జపనీస్ క‌పుల్ డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట తెగ హ‌ల్ చల్ చేస్తోంది‌.

Video Advertisement

కాస్టూమ్స్ తో సహా  ఎన్టీఆర్,అంకిత డ్యాన్స్ స్టెప్పులను అచ్చుగుద్దినట్టు దింపేశారు.ఈ వీడియో  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో కూడా ఈ జంట ఆశోక్ సినిమాలోని గోల గోల అనే మాస్ డ్యూయెట్ కి జపాన్ జంట డ్యాన్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేసింది ..ఇప్పుడు మళ్ళి చీమ చీమ పాట తో మళ్ళి వచ్చేసింది ..చూసి ఎంజాయ్ చేయండి


End of Article

You may also like