గత కొంతకాలం గా హీరో కళ్యాణ్ దేవ్, మెగా డాటర్ శ్రీజ ఇద్దరు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ విడిపోయారని.. వేరే పెళ్లిళ్లకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరూ విడిపోయినట్లు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం తో వారి కోల్డ్ వార్ బయటపడింది.

Video Advertisement

 

 

అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ హోలీ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. హోలీ పండగ వేళ కళ్యాణ్ దేవ్ చాలా జోష్ ఫుల్ గా కనిపించారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన అభిమానులు, మిత్రులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో కళ్యాణ్ దేవ్ విషయంలో ఆల్ ఈజ్ వెల్ అన్న వాదన వినిపిస్తోంది. ఆయన విడాకుల డిప్రెషన్ నుండి బయటకు వచ్చారని, అందుకే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని ఫాన్స్ సంతోష పడుతున్నారు.

kalyan dev's post on holi..!!
2016లో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్నారు. శ్రీజకు ఇది రెండో వివాహం. ఓ ఐదేళ్లు వీరి ప్రయాణం సాఫీగానే సాగింది. వివాహమైనప్పటికీ శ్రీజ తండ్రి వద్దే ఉండేవారు. చిరంజీవి అల్లుడి హోదాలో కళ్యాణ్ దేవ్ హీరోగా మారాడు. 2021 నుంచి శ్రీజతో కళ్యాణ్ దేవ్ కి విభేదాలు తలెత్తాయి. శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

kalyan dev's post on holi..!!

ఒకప్పుడు కళ్యాణ్ దేవ్ మామయ్య చిరంజీవి ఇంట్లో ఉండేవాడు. గొడవలు అయ్యాక ఆయన తన ఇంటికి వచ్చేశాడు. శ్రీజ-కళ్యాణ్ దేవ్ ల కూతురు నవిష్క తల్లి వద్దే పెరుగుతుంది. ఈ క్రమంలో కూతురుని తలచుకుని కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్స్ పెడుతుంటారు. ఆమెను బాగా మిస్ అవుతున్నట్లుగా అనేక సార్లు వెల్లడించారు. ఇక తాజా పోస్ట్ తో కళ్యాణ్ దేవ్ సంతోషంగా ఉంటాడని ఆయన ఫాన్స్ అందరూ ఆశిస్తున్నారు.