హలో హీరోయిన్ నటించిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

హలో హీరోయిన్ నటించిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

by kavitha

మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. క్రైమ్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్, కామెడీ, హార్రర్, ఫ్యామిలీ ఇలా ఏ జోనర్‌ లో తెరకెక్కినా, మలయాళ సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది. సహజమైన కథ, కథనాలతో  కమర్షియల్ అంశాల వైపు వెళ్ళకుండా ఆకట్టుకునేలా తీయడం మాలీవుడ్‌ చిత్రాల ప్రత్యేకత.

Video Advertisement

అందువల్లే మలయాళం చిత్రం రిలీజ్ అయ్యిందంటే, ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి ఎదురుచూస్తారు. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అదే కల్యాణి ప్రియదర్శన్ నటించిన ‘శేషమ్ మైక్ – ఇల్ ఫాతిమా’. ఆ మూవీ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కల్యాణి ప్రియదర్శన్ తెలుగు మూవీ ‘హలో’ తో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ చిత్రానికి గాను ఆమె ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ అవార్డును అందుకుంది. ఆ తరువాత చిత్రాలహరి, రణరంగం సినిమాలతో అలరించారు. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు.  కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన ‘శేషమ్ మైక్ – ఇల్ ఫాతిమా’ మలయాళ మూవీ నవంబర్‌ 17న విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించి, అక్కడ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. డిసెంబర్ 16 నుండి ‘నెట్ ఫ్లిక్స్’లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక మూవీ కథ విషయానికి వస్తే, ఫాతిమా (కళ్యాణి ప్రియదర్శన్)  చిన్నతనం నుండి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకు తండ్రి మునీర్ (సుధేశ్), తల్లి (ప్రియా శ్రీజిత్), అన్నయ్య ఆసిఫ్ (అనీష్) ఉంటారు. తండ్రి అన్నయ్య మెకానిక్ షెడ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. మునీర్ కుటుంబ పరువు ముఖ్యంగా భావిస్తూ ఉంటాడు. ఫాతిమాకు ఆసిఫ్ సపోర్ట్ చేస్తుంటాడు. ఫుట్‌బాల్ చూస్తూ, అర్థం చేసుకుంటూ పెరిగిన ఫాతిమా ఎక్కడున్నా కబుర్లు చెప్పే అలవాటు ఉంటుంది.
కాలేజ్ లో చదివేటప్పుడు ఫుట్ బాల్ టోర్నమెంట్స్ కి ఫాతిమా కామెంటేటర్ గా చేయడంతో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆమె ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లకు వ్యాఖ్యాతగా వృత్తిని కొనసాగించాలని డిసైడ్ అవుతుంది.  కానీ ఫాతిమా జనాల్లోకి వెళ్లడం వల్ల వారి కుల పెద్దల నుండి విమర్శలు వస్తాయి. దాంతో మునీర్ ఫాతిమాకి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే ఫాతిమా మాత్రం అనుకున్నది సాధించిన తరువాతే పెళ్లి చేసుకుంటానని, కొచ్చికి  వెళుతుంది. అక్కడ ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఫాతిమా అనుకున్నది సాధిస్తుందా? అనేది మిగిలిన కథ.

Also Read: సైలెంట్ గా OTT లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది..! ఈ సినిమా చూశారా..?

 


You may also like

Leave a Comment