సైలెంట్ గా OTT లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది..! ఈ సినిమా చూశారా..?

సైలెంట్ గా OTT లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది..! ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ తెలుగు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం సలార్ మూవీ ప్రమోషన్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు.

Video Advertisement

పృథ్వీరాజ్ స్టార్ హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లూసిఫర్ మూవీ ఎంత పెద్ద విజయం సాధిచిందో తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది పృథ్వీరాజ్ సుకుమారనే. ఈ మూవీ తరువాత ‘బ్రో డాడీ’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీలో కూడా మోహన్ లాల్ నటించారు. ఈ మూవీ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, కళ్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ చిత్రం బ్రో డాడీ. ఈ సినిమాకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాని రాజకీయ నేపథ్యంలో తీసిన, పృథ్వీరాజ్ ఈ మూవీని కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించాడు. ఈ మూవీ 2022 లో జనవరి 26న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, జాన్‌ కట్టాడి (మోహన్‌లాల్‌), అన్నమ్మ(మీనా) ల కుమారుడు యేషూ (పృథ్వీరాజ్ సుకుమారన్). యేషూ బెంగళూర్ లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు. అతను కురియన్ (లాలు అలెక్స్), ఎల్సీ కురియన్ (కనిహ) ల కూతురు అన్నా (కళ్యాణి ప్రియదర్శన్)ను ప్రేమిస్తాడు. అన్నా కూడా యేషూని లవ్ చేస్తుంది. జాన్, కురియన్ లు మంచి ఫ్రెండ్స్. వారి భార్యలు తమ పిల్లలకు పెళ్లి చేస్తే బాగుంటుందని భావిస్తారు. అయితే అప్పటికే  బెంగళూరులో యేషూ, అన్నాలు నాలుగేళ్లుగా సహజీవనం చేస్తుంటారు. ఈ విషయం పెద్దలకు  తెలియదు. యేషూ మరియు అన్నా వారి బంధం గురించి తల్లిదండ్రులకు చెప్పాలని ఆలోచిస్తుంటారు.
ఈలోగా అన్నా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. దాంతో యేషూ షాక్ అవుతాడు. అదే టైమ్ లో అర్జంట్ గా రమ్మని జాన్‌ నుండి కాల్ వస్తుంది. వెంటనే బయలు దేరి తండ్రి దగ్గరికి వెల్లున యేషూకు జాన్ అతని తల్లి ప్రెగ్నెంట్ అనే షాకింగ్ వార్తను జాన్, అన్నమ్మలు చెబుతారు. విషయం తెలిసిన యేషూ ఎలా రియాక్ట్ అయ్యాడు? అన్నా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని  జాన్, అన్నమ్మలకు ఎలా చెప్పాడు? అది విన్న వారు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఈ మలయాళ స్టార్ హీరోలు ఇద్దరు తండ్రీకొడుకులుగా నటించడం ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

Also Read: SALAAR: సలార్ రిలీజ్ ట్రైలర్ లో ఈ రెండు సీన్స్ గమనించారా.? దీని వెనక అర్ధం అదేనా.?

 


End of Article

You may also like