కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కర్ణాటక ఆదివాసీ ప్రజల సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో రిషబ్ నటన సినిమాకే హైలైట్. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. సుమారు 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. కేజీఎఫ్ తో అందర్నీ తన వైపుకు తిప్పుకున్న కన్నడ పరిశ్రమ.. ఈ చిత్రం తో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది.

Video Advertisement

 

విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లో అంతగా తెలిసిన నటులు ఎవరు లేకపోయినా.. కంటెంట్ తో వచ్చి అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటే బావుంటుందని అందరూ అనుకున్నారు. అయితే మేకర్స్ కూడా కాంతార 2 ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. కానీ అందరూ అనుకున్నట్లు ఇది సీక్వెల్ కాదు. ప్రీక్వెల్ అని తెలిపారు మేకర్స్. ఈ చిత్రం లో హీరో శివ తండ్రి అడవిలో అర్థాంతరంగా మాయం అయిపోతాడన్న విషయం మనకి తెల్సిందే. సో అక్కకి నుంచి ఈ ప్రీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది.

the story of kanthara prequel movie..

ఇప్పటికే ఇప్పటికే దర్శకుడు రిషబ్ శెట్టి స్టోరీ మీద కసరత్తు చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. 2024 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిర్మాత, హోంబలే ఫిలింస్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ కాంతార 2 పై మాట్లాడారు. “రిషబ్ ఇప్పుడు కథను రాస్తున్నాడు. సినిమా కోసం పరిశోధన చేయడానికి రెండు నెలల పాటు తన రైటింగ్ అసోసియేట్‌లతో కోస్టల్ కర్ణాటక అడవులకు వెళ్ళాడు.” అని తెలిపారు. అయితే మన దగ్గర ప్రీక్వెల్స్ చాలా అరుదు. ఇంతకు ముందు బాహుబలి చిత్రానికి ప్రీక్వెల్ తీస్తాం అన్నారు కానీ అది అటకెక్కింది. కాంతారా కి సీక్వెల్ అనౌన్స్ చేసాక చాలా మంది కథ ఎలా ఉండబోతుంది అనే ఆలోచనలో పడ్డారు.

 

the story of kanthara prequel movie..

ఎందుకంటే కాంతారా సినిమాలో శివ పాత్ర తండ్రి లాగ భూతకోలా చేస్తూ అడవిలోకి వెళ్లి మాయం అయ్యాడు. ఇప్పుడు కాంతార 2 లో శివ తండ్రి దగ్గర సినిమా కథ ప్రారంభించే అవకాశం ఉంది. అక్కడ నుంచి.. భూములు ఎలా వచ్చాయి.. ఆ తర్వాత జరిగిన అంశాల చుట్టూ.. కథను అల్లుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రిషబ్ శెట్టి కర్ణాటకలోని కోస్టల్ ప్రాంత నేపథ్యాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. కాంతారా సినిమా సీక్వెల్ లో మరిన్ని విషయాలను చెప్పాలని రిషబ్ శెట్టి నిర్ణయించుకున్నాడు. కాంతార చిత్రం ఏ అంచనాలు లేకుండా వచ్చింది.. కానీ ఇప్పుడు కాంతార 2 పై భారీ అంచనాలున్నాయి. మరి అతని ప్రయత్నం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.