విజయ్ దేవరకొండ తన కెరీర్ లో నే పెద్ద పాన్ ఇండియా సినిమాగా పూరి దర్శకత్వం లో లైగర్ చిత్రం చేసాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీనికి పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా సహ నిర్మాతగా ఉన్నాడు. ఈ చిత్రం తో విజయ్ బాలీవుడ్ లో పాగా వేద్దాం అనుకున్నాడు కానీ ఆ అంచనాలు తల్లకిందులయ్యాయి.

Video Advertisement

మరో వైపు ఈ చిత్రాన్ని కొని నష్టపోయిన బయ్యర్లు పూరి ని నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేసేవరకు వెళ్ళింది. దీంతో పూరి పోలీస్ రక్షణ కోరాడు అన్న విషయం తెలిసిందే.

karan johar wants ligar climax to be re shooted..
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్ అవుతోంది. లైగర్ చిత్ర స్క్రీనింగ్ సమయం లో కరణ్ జోహార్ కు మూవీ నచ్చక మధ్యలోనే బయటకు వెళ్ళిపోయాడు అని వార్తలు వస్తున్నాయి. మైక్ టైసన్ తో వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలను రీ షూట్ చెయ్యాలని కరణ్ పూరికి సూచించినట్లు సమాచారం. కానీ పూరి మాత్రం క్లయిమాక్ చాలా బావుందని.. తమ టీం అందరికి నచ్చిందని చెప్పాడట.. దీంతో కరణ్ ఈ చిత్రం పై ఆశలు వదిలేసుకొని అప్పటినుంచి చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన లేదని తెలుస్తోంది.అంతే కాకుండా కరణ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరియు విడుదలపై ఆసక్తి చూపలేదు అని సమాచారం.

మరో వైపు లైగర్ సినిమా హీరోయిన్ విషయం లో వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని కరణ్ జోహార్ సన్నిహితులు వెల్లడిస్తున్నారు. గతం లో ఒక ఇంటర్వ్యూ లో పూరి మాట్లాడుతూ ..ముందు నుంచి ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా జాన్వికపూర్‌నే అనుకున్నాను. నేను శ్రీదేవి అభిమాని కావడంతో నా ప్రాజెక్ట్‌తో శ్రీదేవి కూతురిని తెలుగులో పరిచయం చేయాలనుకున్నాను. కానీ కరణ్ జోహార్ చెప్పడంతో అనన్య పాండే ని తీసుకున్నాం అని తెలిపారు. కానీ జాన్వి కపూర్ డేట్స్ కుదరక పూరి అనన్య పాండే ని తీసుకున్నారని.. దీంట్లో కరణ్ ప్రమేయం లేదని ఆయన సన్నిహితులు వెల్లడించారు.

karan johar wants ligar climax to be re shooted..
కానీ ఈ సినిమా జయాపజయాలను పక్కన పెట్టి కరణ్ విజయ్ దేవరకొండ తో మరో చిత్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.