కార్తీకదీపం సీరియల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం టాప్ సీరియల్ ఏది అంటే అందరూ ఆలోచించకుండా చెప్పే సమాధానం కార్తీకదీపం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ గా నిలిచింది. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.Karthika deepam monitha twist to doctor babu

ఈ సీరియల్ లో హీరో, హీరోయిన్ తో పాటు అంత గా క్రేజ్ సంపాదించుకున్న పాత్ర మోనిత. మోనిత పాత్ర పోషిస్తున్న శోభా శెట్టి కేవలం ఈ సీరియల్ మాత్రమే కాకుండా, కన్నడలో కూడా రుక్కు అనే ఒక సీరియల్ లో నటిస్తున్నారు. అయితే, సీరియల్ నుండి శోభా శెట్టి తప్పుకుంటున్నారు అనే వార్త కొంత కాలం నుండి వైరల్ అయ్యింది. ఇవన్నీ తప్పు అని కొట్టిపారేసే లాగా మోనిత రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రోజుకు ఒక ట్విస్ట్ తో ఉత్కంఠగా సాగుతోంది సీరియల్.Karthika deepam monitha twist to doctor babu

శోభా శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇటీవల ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో డాక్టర్ బాబు తమ్ముడు పాత్ర పోషించిన యశ్వంత్ తో ఉన్నారు శోభా శెట్టి. అంతే కాకుండా యశ్వంత్ తో ఒక యూట్యూబ్ వీడియో కూడా చేయబోతున్నారట శోభా శెట్టి. ఈ విషయాన్ని ఈ పోస్ట్ కింద కాప్షన్ లో తెలిపారు. దాంతో “మా డాక్టర్ బాబు సేఫ్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, ఈ ఫోటోలకి వచ్చిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.