ఒక్క ఫోన్ కాల్ వల్ల ఇన్ని సమస్యలు వస్తాయా..? OTT లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా చూశారా..?

ఒక్క ఫోన్ కాల్ వల్ల ఇన్ని సమస్యలు వస్తాయా..? OTT లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా చూశారా..?

by Harika

Ads

మలయాళం నుండి మరొక సినిమా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ఈ సినిమా పేరు కీచురాళ్ళు. రాహుల్ రాజి నాయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రజీషా విజయన్ హీరోయిన్ గా నటించారు. 2022 లో కీడమ్ అనే పేరుతో మలయాళం లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ఈటీవీ విన్ యాప్ లో కీచురాళ్ళు పేరుతో విడుదల చేశారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రాధిక (రజీషా విజయన్) ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నో విషయాల్లో కేస్ పరిష్కరించడానికి సహాయం చేస్తుంది. రాధిక తండ్రి ఒక లాయర్.

Video Advertisement

movie

తర్వాత రాధికకి ఒక రోజు ఫ్రిడ్జ్ రిపేర్ రావడంతో ఒక అతనికి ఫోన్ చేస్తుంది. అతను మాట్లాడే మాటలు రాధికకి నచ్చవు. అందుకే ఫోన్ కట్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం రాధిక ఫోటోలు అన్నీ ఫేస్ బుక్ లో చూసి ఆమె వెనకాల పడటం మొదలు పెడతాడు. మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు. కానీ అతను అందరూ అనుకున్నట్టుగా ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వ్యక్తి కాదు. ఈ విషయాలన్నీ రాధిక ఎలా కనిపెట్టింది అనేది మిగిలిన కథ. కేవలం రాధిక అనే ఒక పాత్ర చుట్టూ సినిమా తిరుగుతుంది. ఇది ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమాలో తన పాత్రలో అంతే బాగా నటించారు రజీషా విజయన్.

లొకేషన్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఈ కాలంలో జరిగే చాలా విషయాల మీద ఈ సినిమా ఫోకస్ చేస్తుంది. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ సాగదీసినట్టు అనిపించినా కూడా సినిమా అంతా కూడా ఒకే విషయం మీద సాగుతుంది. దాంతో సినిమా చూసే వారికి తర్వాత ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి చాలా మంచి స్పందన వస్తోంది. ఈ తరం వాళ్ళని ఉద్దేశించి ఈ సినిమా తీసినా కూడా కుటుంబం అంతా కలిసి చూసే విధంగా సినిమాని రూపొందించారు. అందుకే అందరూ చూసి ఈ సినిమా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 


End of Article

You may also like