సోషల్‌ మీడియాలో తన పై వస్తున్న విమర్శలను  పట్టించుకోవలసిన పని లేదని కీర్తి సురేష్ అన్నారు. మహానటి పాత్రలో నటించినందుకు తనను దారుణంగా విమర్శించారని తెలిపింది. అలాగే మహానటి సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది మలయాలి భామ.

Video Advertisement

నేచురల్ స్టార్ నానీ హీరోగా నటించిన దసరా చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 30న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఐదు భాషలలో రిలీజ్ కానుంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మ‌హాన‌టి మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విష‌యాల‌ను చెప్పుకొచ్చింది.
keerthy-suresh-on-mahanati-trollsసినిమా ప్ర‌మోష‌న్స్ లో బాలీవుడ్ మీడియా మీ పై వ‌స్తున్నట్రోల్స్ గురించి మీ రియాక్షన్ ఏమిటి అని అడగడంతో కీర్తి ఇలా సమాధానం ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో తన పై వ‌చ్చే ట్రోల్స్ ను మరియు నెగిటివ్ కామెంట్స్ తాను పట్టించుకోను అని తెలిపింది. మహానటి చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు తన పై దారుణమైన ట్రోల్స్ చేశారని కీర్తి సురేశ్ చెప్పారు. keerthy-suresh-on-mahanati-trolls1 సావిత్రి క్యారెక్టర్ చేయడానికి మొదట తాను చాలా భ‌య‌పడ్డానని, అందుకే ఆ సినిమాకి మొదట నో చెప్పానని అన్నారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ నువ్వు చేయగలవు అని ప్రోత్స‌హించడంతో ఆ మూవీ చేయగలిగానని  తెలిపింది. ఈ పాత్ర చేయడం నీకే సాధ్యం అని డైరెక్టర్ చెప్పడంతో ఆయ‌నకి  అంత‌ నమ్మకం ఉండడంతో మ‌హాన‌టి సినిమాలో నటించానని కీర్తి సురేష్ వెల్లడించింది. ఇక ఈ సినిమా ఆమె కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే కీర్తి సురేష్ కెరీర్ మహానటి తరువాత ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు మహానటి చిత్రం అంత పాపులారిటీని తీసుకొచ్చింది.
keerthi-sureshAlso Read: గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్న సీరియల్ నటి.. వైరల్‌ గా మారిన పెళ్లి ఫొటోలు..