హీరోయిన్ కీర్తి సురేష్ పేరు చెప్పగానే ‘మహానటి’ సినిమానే గుర్తొస్తుంది. నటిగా ఎన్ని మూవీస్ చేసినా సరే ఆ చిత్రం.. ఆమెకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా ‘భోళా శంకర్’, నాని ‘దసరా’ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్, శింబులతో కలిసి నటిస్తోంది. వీటితో పాటే రివాల్వర్ రీటా, రఘుతాత అనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ దసరా చిత్ర షూటింగ్ చివరి రోజున టీం కి బంగారు నాణేలు పంచింది. ఈ విషయం తెలుసుకున్న అందరు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Video Advertisement

 

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ‘దసరా’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమా మార్చ్ 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. చివరి రోజు షూటింగ్లో భాగంగా కీర్తి సురేష్ ఈ చిత్రానికి పని చేసినటువంటి 130 మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రెండు గ్రాముల బంగారపు కాయిన్స్ కానుకగా ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారు.

keerthi suresh distributed gold coins to dasara team..

ఇందుకోసం ఆమె ఏకంగా రూ.13 లక్షలు ఖర్చు చేసిందట. దీంతో కీర్తి సురేష్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా కాలం గా హిట్ లేని కీర్తి.. దసరా సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా లోని తన పాత్రకు ఉన్న ప్రాముఖ్యతపై ఆమె చాలా నమ్మకం పెట్టుకుని ఉందట. అందుకే సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత యూనిట్ సభ్యులకు బంగారు కాయిన్స్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇంతకు ముందు పందెంకోడి 2 యూనిట్ సభ్యులకు కూడా ఇలా బంగారపు కాయిన్స్ ఇవ్వడం విశేషం.

keerthi suresh distributed gold coins to dasara team..

ఈ విషయాన్ని బహుమతులు అందుకున్న కొంతమంది సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ కీర్తి సురేష్ కి థాంక్యూ చెబుతూ పోస్ట్ లు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో సముద్రఖని, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, మీరా జాస్మిన్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.