సాధారణం గా చాలా మంది అమ్మాయిలు ఇది చేయలేరు..అది చేయలేరు అంటూ వాళ్ళ మైండ్ ని ప్రేరేపిస్తూ ఉంటారు. అయితే.. కేరళకు చెందిన కృష్ణ అనే బాలిక మాత్రం అందరు అమ్మాయిలలా తాను కూడా చేయలేను అని అనుకోలేదు. ఎందుకు చేయలేను అని అనుకుంది. అనుకున్నదే తడవు గా సాధించింది. దాని ఫలితమే.. ఈ కింద ఇవ్వబడిన వీడియో.

kerala girl krishna 3

పైన ఫోటో చూసారుగా.. ఒక అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ గా గుర్రపు స్వారీ చేస్తోందో. ఆమె తన స్కూల్ కి వెళ్ళేటప్పుడు, పరీక్షల సమయం లోను గుర్రపు స్వారీ చేస్తూనే వెళ్తుంది. తాజాగా, ఆమె గుర్రపు స్వారీ చేస్తూ స్కూల్ కి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది. అయితే, దీని వెనుక ఉన్న కారణం గా చాలా ఆసక్తి కరం గా ఉంది. కేరళ త్రిశూర్ జిల్లా కు చెందిన కృష్ణ తన స్నేహితులతో గుర్రపు స్వారీ గురించి మాట్లాడినప్పుడు.. వారు అది అందరికి సాధ్యం అయ్యేది కాదని, ఝాన్సీ రాణి లాంటి వారు మాత్రమే చేయగలరని అన్నారట.

kerala girl krishna

అయితే, ఆ మాటలు విన్న కృష్ణ ఒక సాధారణ అమ్మాయి ఎందుకు చేయలేదు అని ఆలోచించి తాను కూడా గుర్రపు స్వారీ చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా తన తండ్రిని గుర్రపుస్వారీ చేయాలని ఉందని కోరింది. ఆమె నేర్చుకోవడానికి వీలుగా ఒక చిన్న తెల్లని గుర్రాన్ని ఆమె తండ్రి కృష్ణకు ఇచ్చి గుర్రపు స్వారీ నేర్చుకోవడం లో సాయం చేసారు. అలా ఆమె దానిపై పట్టు సాధించిన తరువాత తన స్కూల్ కి కూడా గుర్రం పైనే వెళ్లడం అలవాటు చేసేసుకుంది. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న కృష్ణ ఇటీవల పరీక్షకు టైం అయిపోతుండడం తో.. ఆమె చాలా వేగం గా, కాన్ఫిడెంట్ గా తన గుర్రం పై స్వారీ చేస్తూ వెళ్ళింది. ఈ వీడియో వైరల్ అవుతుంది.

kerala girl krishna 2

తాజాగా, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్ర కూడా ఈ బాలిక గురించి తన ట్విట్టర్ ఖాతా లో పంచుకుంటూ.. “ఈ అమ్మాయి ఫోటో ఎవరి వద్దనైనా ఉందా..? ఈ బాలిక ఫోటోను నేను మొబైల్ స్క్రీన్ షాట్ గా పెట్టుకోవాలనుకుంటున్నా.. నా దృష్టిలో ఈమె ఓ హీరో.. ఇలాంటివి చూస్తున్నపుడు అమ్మాయిల చదువు మరింత ముందుకు వెళుతోందని అనిపిస్తోంది..” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.

watch video : 

“>