ప్రస్తుతం సక్సెస్ అంటే.. చదువు పూర్తవ్వగానే ఐదంకెల జీతం వచ్చే ఉద్యోగం లో చేరడమేనని అందరు అనుకుంటున్నారు. కానీ సక్సెస్ అంటే ఉద్యోగం సంపాదించడమో… అనుకున్నంత సంపాదన వస్తోందని సంబరపడటమో కాదు. అనుకున్న పనిని సాధించి, కల ని నెరవేర్చుకోవడం. చాలా మందికి ఏదో ఒక ఉద్యోగం వచ్చాక.. కొంత కాలం బాగానే ఉంటుంది. కొన్నాళ్ళకి.. జీవితం నచ్చదు. ఏదో చేయాలి అనే తపన పెరుగుతూ ఉంటుంది.

kesav 1

అందుకే ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం వైపు వెళ్లాలనుకుంటారు. అయితే.. క్రియేటివిటీ లేకుంటే.. నిలదొక్కుకోవడం కష్టమే అవుతుంది. ఇలా సాధించి జీవితం లో నిలదొక్కుకునే వారు తక్కువమంది వుంటారు. వారిలో కేశవ్ రాయ్ కూడా ఒకరు. కేశవ్ చిన్నతనం నుంచి స్కూల్ లో యావరేజ్ స్టూడెంట్ గానే ఉండేవాడు. అయితే స్వయం ఉపాధి ద్వారా ఉన్నతమార్గాలను చేరుకోవాలని అనుక్షణం తపన పడుతూ ఉండేవాడు. ఈ క్రమం లో పలుసార్లు ఓడిపోయాడు కూడా.

kesav 2

చివరకు తన ఐడియా క్లిక్ అయ్యి విజయం సాధించాడు. కేశవ్ రాయ్ కు సెమి ఆటోమేటిక్ బైక్ కవర్లను తయారు చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. ఇందుకోసం అతను 2016 లోనే బైక్ బ్లేజర్ అనే సంస్థని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రోడక్ట్ కోసం 2017 లోనే పేటెంట్ పొందాడు. అయితే ఈ ప్రోడక్ట్ ఉపయోగం జనాలకు అర్ధం కావడానికి కొంత సమయం పట్టింది.

kesav 3

ఈ సెమి ఆటోమేటిక్ బైక్ కవర్లు ద్విచక్రవాహనాలు కలిగి ఉన్న వారికి ఎంతో ఉపయోగకరం గా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ ని బైక్ కి అమరిస్తే సరిపోతుంది. ముప్పై నిమిషాల్లో మొత్తం కవర్ చేస్తుంది. వర్షం పడినా కూడా బైక్ ఏమి పాడవదు. వర్షం వెలిసాక కూడా బండి పొడిగానే ఉంటుంది. ఈ కవర్ లో అన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లలోను లభిస్తున్నాయి. 780 రూపాయలు, 850 రూపాయల ధరకు వీటిని కొనుక్కోవచ్చు. ఈ వ్యాపారం మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ప్రస్తుతం బాగానే సాగుతోంది.

kesav

కేశవ్ ఇప్పటి వరకు 75 వేల కవర్లను విక్రయించాడు. ఏడాదికి 1.30 కోట్ల టర్నోవర్ తో అతనికి బిజినెస్ నడుస్తోంది. ఈ కంపెనీ స్థాపించిన మొదట్లో కేశవ్ తన ఇంటి మేడపైనే వ్యాపారాన్ని నడిపాడు. ప్రస్తుతం ఢిల్లీ, ఘజియాబాద్ లలో కూడా రెండు పరిశ్రమలను ఏర్పాటు చేసాడు. ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని కేశవ్ యోచిస్తున్నాడు.