టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచమైన హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ నుంచి తెలుగు తెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుంది. “భరత్ అనే నేను” తో పాపులర్ అయిన బాలీవుడ్ స్మార్ట్ బ్యూటీ తరువాత వినయ విధేయ రామ తో మెరిసింది కానీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.ఆ సినిమా ప్లాప్ అవ్వడం తో మళ్ళి టాలీవుడ్ లో ఇంత వరకు కనిపించలేదు.

kiara advani

ఇది ఇలా ఉండగా…సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా నే ఉంటుంది కైరా అద్వానీ. తన అందచెందాలతో ఫోటోలు పెడుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల ఆమె సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారో చెప్పుకొచ్చారు. ఆమె ఓ ప్లే స్కూల్ లో టీచర్ గా చేశారట. ఉదయం ఏడుగంటలకల్లా ఆమె స్కూల్ కి వెళ్లి పిల్లలను చూసుకునేవారట. వారికి ఆల్ఫాబెట్స్ నేర్పించడం, పాఠాలు చెప్పడం.. అవసరమైతే డైపర్స్ ను కూడా చేంజ్ చేసేవారట.