చాలా మంది పిల్లలకి గోళ్ళు కొరకడం అలవాటు ఉంటుంది. నిజానికి గోళ్ళు కొరకడం అనేది మంచి అలవాటు కాదు. పిలల్లు కనుక గోర్లను కొరుకుతున్నారంటే ఆ అలవాటుని మాన్పించడానికి చూడండి. ఎందుకంటే మట్టి వంటివి ఉంటాయి. కనుక తల్లిదండ్రులు అలవాటును మాన్పించాలి.

Video Advertisement

అయితే మీ పిల్లలు కనుక గోర్లు కొరుకుతుంటే ఇలా చేయండి. గోర్లు కొరుకుతుండడాన్ని అన్ కంట్రోలబుల్ బైటింగ్ అని అంటారు. అయితే పిల్లలు గోళ్ళు కొరకడం మానేయడం లేదని వాళ్ళను తిట్టకూడదు.

 

#1. పిల్లల గోళ్లను శుభ్రం చెయ్యండి:

పిల్లలు తరచూ గోళ్లను కొరుకుతూ ఉంటే గోర్లను శుభ్రం చేయాలి. పిల్లలు గోర్లు లో ఉండే మట్టిని తొలగిస్తూ ఉండాలి. దాని వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క గోళ్ళల్లో వుండే క్రిములు నోట్లోకి వెళ్ళవు. లేదంటే దీని వలన జబ్బులు కూడా వచ్చే అవకాశం వుంది. కాబట్టి పిల్లల గోర్లను శుభ్రం చేస్తూ ఉండాలి.

#2. గోళ్ల ని చిన్నగా కత్తిరిస్తూ ఉండాలి:

అలానే వాళ్ల గోళ్ల ని చిన్నగా కత్తిరిస్తూ ఉండాలి. ఒకవేళ కనుక మీ పిల్లలు గోర్లు కొరుకుతూ ఉన్నట్లయితే వాళ్ళ నెయిల్స్ ని కట్ చెయ్యండి. కాళ్ళ గోళ్లను కూడా కట్ చేస్తూ వుండండి.

#3. ఆటబొమ్మలను ఇవ్వండి:

మీ పిల్లలు కనుక గోర్లను కొరుకుతుంటే ఆ అలవాటు మాన్పించడానికి ఆట బొమ్మలు ఇవ్వండి. ఇలా వారి చేతికి ఆట బొమ్మలు ఇవ్వడం వలన కూడా ఈ అలవాటును మాన్పించవచ్చు.

#4. పిల్లల యొక్క బిహేవియర్ ని గమనించండి:

గోర్లు కొరుకుతున్నప్పుడు మీ పిల్లల యొక్క బిహేవియర్ ని మీరు చూస్తూ ఉండాలి. అంతే కానీ వారిని మనం అలా వదిలేయకూడదు. వాళ్ల ప్రవర్తన చూసి దానికి తగ్గట్టుగా వాళ్లని మార్చుతూ ఉండాలి. ఇలా ఈ విధంగా ఫాలో అవ్వాలి తప్ప పిల్లల్ని గోర్లు కొరుకుతున్నారని నిందించకూడదు. చాలా మంది తల్లిదండ్రులు తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదు. మంచిగా మీరు మీ పిల్లల్ని చూసుకోవాలి కొట్టడం, తిట్టడం వల్ల ప్రయోజనం ఉండదు.