Ads
ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి ఉత్తర కొరియా క్షిపణుల పరీక్షలు ప్రారంభించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ భయందోళనలకి గురవుతున్నాయి. ముందు హెచ్చరికలాంటివి ఏమి లేకుండా బాలిస్టిక్ క్షిపణిని జపాన్ మీద నుండి పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రయోగించింది.
Video Advertisement
అంతే కాకుండా దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో క్షిపణి ప్రయోగం చేశారు. దీనివల్ల పలు భయాందోళనలు మొదలయ్యాయి. అసలు కిమ్ ప్రయోగించింది ఒక బాలిస్టిక్ మిస్సైల్ అని దక్షిణ కొరియా, జపాన్ సైనికాధికారులకి చెప్పారు.
ఉత్తర కొరియా అత్యాధునిక ఆయుధాలను పరీక్షిస్తూ ముందుకు వెళ్లడానికి అమెరికాని లక్ష్యం చేయడం కారణం అని అంటున్నారు. కిమ్ ఇలా చేయడంతో తమ దేశ భద్రతకు ప్రమాదం పొంచి అవకాశం ఉంది అని కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవన్నీ కాకుండా మరో మిస్సైల్ ప్రయోగం చేస్తున్నారు. దీనివల్ల జపాన్ లో ఆందోళనలు నెలకొన్నాయి.
నార్త్ కొరియా వాళ్ళు మాట్లాడుతూ తమ దేశంపై అమెరికా వ్యతిరేకంగా ఉన్నందువల్లే వారు అణు పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. నెలలో ఏడు సార్లు క్షిపణి ప్రయోగం నిర్వహించారు. చైనా వింటర్ ఒలింపిక్స్ కారణంగా కొంతకాలం వీటిని ఆపారు. అవి ఇటీవలే ముగియడంతో మళ్లీ తిరిగి మొదలు పెట్టారు. దీనికి ఇటీవల ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్ ఒక నిదర్శనం అని చెప్పారు. ఈ విషయంపై దక్షిణ కొరియా మాత్రమే కాకుండా మిగిలిన దేశాలు కూడా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.
End of Article