Ads
భారతదేశాన్ని పాలించిన చక్రవర్తులలో అగ్రగణ్యుడు అశోక చక్రవర్తి. ఇతను మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తు మౌర్యుని మనవడు. బింబిసారుని పుత్రుడు. ఇతని పరిపాలన క్రీ.పూర్వం 268 సం.నుండి 232 సం.దాకా సాగింది. దాదాపు భారతదేశమంతా (తమిళనాడు, కేరళ, కర్ణాటకలలోని కొన్ని ప్రాంతాలు తప్ప) అశోకుని ఏలుబడిలోకి వచ్చింది. అశోకుని కాలంలో భారతదేశం ఉన్నత స్థితికి చేరుకుంది. అయితే మనకు ఆయన గురించి చాలా తక్కువ విషయాలు తెలుసు.
Video Advertisement
అశోకుడు తన తాత చంద్రగుప్తుని శౌర్య పరాక్రమాలకు వారసుడు. అశోకుడు తన జైత్రయాత్రలో భాగంగా కళింగ రాజ్యం (నేటి ఒడిషా) మీదకు దండెత్తాడు. కళింగులు కూడా గొప్ప సాహసంతో అశోకుడి సేనలను ఎదుర్కొని ఓడిపోయారు. తీవ్రంగా జరిగిన ఈ యుద్ధంలో దాదాపు లక్షమంది సైనికులు మరణించారు. ఎందరో గాయాలపాలయ్యారు. ఈ భయంకర దృశ్యాలు స్వయంగా చూసిన అశోకుని మనస్సు వికలమై బౌద్ధమతాన్ని స్వీకరించాడని మనం చదువుకున్నాం. అయితే ఈయన సింహాసనం కోసం తన 99 మంది సోదరులను హతమార్చాడని మీకు తెలుసా..!!
బుద్ధుడు తన ధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు వెళ్తున్నపుడు ఒక ప్రాంతం లో ఓ బాలుడు అతడికి మట్టిని ఆహారంగా ఇస్తాడు. అప్పుడు బుద్ధుడు నవ్వి అతడి శిరస్సుపై చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. అప్పుడు బుద్దుడికి ఆ బాలుడే తన బౌద్ధ ధర్మాన్ని ప్రపంచమంతా చాటి చెప్తాడని అర్థమవుతుంది. ఆ బాలుడే తర్వాతి జన్మలో చంద్రగుప్త మౌర్యుని మనవడైన అశోకుడు. అయితే అశోకుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు బిందుసారునికి, ఒక బ్రాహ్మణ యువతి అయిన సుభద్రాంగికి జన్మిస్తాడు. అయితే అశోకుడిని యువరాజుగా ఎవరూ చూసేవారు కాదు.
అలాగే తన తండ్రి కి దగ్గర అయ్యేందుకు అశోకుడు ఎంతో ప్రయత్నించేవాడట.. కానీ బిందుసారుడికి అశోకుడు నచ్చేవాడు కాదు. అయితే కొంతకాలం తర్వాత బిందుసారుడు తన రాజ్యానికి తదుపరి రాజు ఎవరని రాజ గురువుని అడగ్గా..అశోకుడి రాజు అవుతాడని సూచనప్రాయంగా చెబుతాడు. అయితే అది ఇష్టం లేని బిందుసారుడు అశోకుడిని ఉజ్జయిని ని పాలించమని పంపేస్తాడు. అక్కడే అశోకుడి కి వేదిస మహాదేవి సక్యకుమారి పరిచయం అవుతుంది. ఆమే అతడికి బౌద్ధ మతం గురించి చెపుతుంది. వీరిద్దరి వివాహానికి అశోకుడి సోదరులు అడ్డుపడినా.. ఎంతో కష్టపడి ఆమెను వివాహం చేసుకుంటాడు అశోకుడు. వారికి మహేంద్ర, సంఘమిత్ర జన్మిస్తారు.
తర్వాత బిందుసారుడు తన చివరిక్షణాల్లో తన పెద్ద కుమారుడు సుసీమ రాజు కావాలని మంత్రులను ఆదేశిస్తాడు. కానీ అతడు మంచి వాడు కాదని భావించిన మంత్రులు అతడిని చంపించి అశోకుడిని రాజుని చేస్తారు. ఇది రాజ కుటుంబం లో ఎవరికీ నచ్చదు. ఈ విషయం తెలుసుకున్న అశోకుడు తన సోదరులు ఒక్కొక్కరిని వధించాడు. తర్వాత తన రాజ్యాన్ని విస్తరించడం మొదలు పెట్టాడు. చండశాసనుడు, క్రూరుడుగా పేరుపొందాడు. తాను రాజుగా ఎదిగేందుకు సహకరించిన మంత్రులు ఇతరులకి సహాయం చేయకూడదు అని 500 లకు పైగా మంత్రులను చంపేస్తాడు. తనని బాల్యం లో హేళన చేసిన వారిని కూడా అశోకుడు క్రూరంగా హింసించి చంపాడు.
అశోకుడు తన జైత్రయాత్రలో భాగంగా కళింగ రాజ్యం (నేటి ఒడిషా) మీదకు దండెత్తటం జరిగింది. ఒక సంవత్సరం పాటు ఈ యుద్ధం జరుగుతుంది. లక్షల మంది మరణించారు. ఈ భయంకర దృశ్యాలు స్వయంగా చూసిన అశోకునికి యుద్ధ విజయం ఆనందాన్ని ఇవ్వలేదు. మనస్సు వికలమై బౌద్ధమతాన్ని స్వీకరించాడంటారు. తర్వాత ప్రజలను ప్రేమతో చూసుకోవడం తో పాటు. చెట్లు నాటించడం, బావులు తవ్వించడం, రహదారులు వేయడం, విశ్రాంతి భవనాలు, ఆస్పత్రులు నిర్మించటం వంటివి చేసాడు. అతడి కాలం లోనే బుద్ధిజం వ్యాప్తి చెందింది.
అశోకుడు మారిన తర్వాత భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ కాలం లో ప్రతి ఒక్కరు ధనవంతులుగా మారారు. దోపిడీ దొంగలను కూడా అశోకుడు మార్చాడు. చివరికి తన మనవడు దశరథ మౌర్యుడికి రాజ్యాన్ని అప్పగించి ధ్యానం చేసుకోడానికి వెళ్ళిపోయాడు. అయితే అశోకుడు తన జీవితం లో ఎన్నో తప్పులు చేసాడు. కానీ మనం అతడి గురించి చదువుకున్నది అతడు చేసిన మంచి విషయాల వల్ల మాత్రమే. అతడిలోని పశ్చాత్తపమే అతడిని మనిషిని చేసింది. చరిత్రలో ఇంతటి గొప్పవాడిగా నిలబెట్టింది.
watch video:
End of Article