Ads
జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. జబర్దస్త్ షోలో ఎన్నో సంవత్సరాలు అలరించి, ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు పేరుతో ఒక హోటల్ మొదలు పెట్టారు. తర్వాత దీనికి బ్రాంచెస్ కూడా విస్తరించారు. ఎంతో మంది సెలబ్రిటీలు దీనికి ప్రచారం చేశారు.
Video Advertisement
ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి, తమ హోటల్ గురించి ఆర్పీ చాలా సార్లు చెప్పారు. అయితే, ఈ హోటల్ మీద ఒక సమయంలో ఒక కామెంట్ ఎక్కువగా వచ్చింది. “ఇందులో ధరలు ఎక్కువగా ఉన్నాయి” అంటూ కామెంట్స్ చేశారు. ఇందులో ధరలు చూసుకుంటే,
# రవ్వ – 2 పీసెస్ కి 235 రూపాయలు, 4 పీసెస్ కి 450 రూపాయలు.
# కొరమీను – 3 పీసెస్ కి 390 రూపాయలు, 5 పీసెస్ కి 650 రూపాయలు.
# సన్న చేపలు – హాఫ్ అయితే 260 రూపాయలు-6 పీసెస్, ఫుల్ అయితే 520 రూపాయలు 12 పీసెస్.
# బొమ్మిడాయి – హాఫ్ 390 రూపాయలు, ఫుల్ 650 రూపాయలు.
# తలకాయ కూర – 2 పీసెస్ 195 రూపాయలు, 4 పీసెస్ 390 రూపాయలు.
# రాగి సంగటి – 95 రూపాయలు.
# వైట్ రైస్ – హాఫ్ 65 రూపాయలు, ఫుల్ 130 రూపాయలు.
ఈ ధరలు అన్నీ కూడా అమీర్ పేట్ లో ఉన్న నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు హోటల్ లో ఉన్న ధరలు. ఈ ధరలపై కామెంట్స్ రావడంతో ఆర్పీ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. “ఇది నా వ్యాపారం. నా రేట్లు ఇంతే. కారు కొనుక్కోవాలి అనుకున్న వాళ్లు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. అలాగే నా దగ్గర ఉన్న వంటలని కూడా కొనగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లు మాత్రమే కొనుక్కుంటారు. తక్కువ రేటు అని చెప్పి ఎలా పడితే అలా ఇవ్వలేము. వంటకాల కోసం మేము క్వాలిటీ ఎక్కువగా ఉన్న పదార్థాలని వాడతాము.”
“నా చేపల పులుసు అందుబాటులో ఉంటే తినాలి. లేకపోతే వద్దు. కొంత మంది కావాలి అని నా భోజనం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 100 రూపాయలు జేబులో పెట్టుకొని వచ్చి 1000 రూపాయల ఆహారం కావాలి అంటే వస్తుందా? మా చేపల పులుసు తినండి అని నేను ఎవరిని బ్రతిమలాడను. నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను. ఎంత రేటు పెట్టాలి అనే విషయం నాకు తెలుసు. నా చేపల పులుసు మీద నాకు నమ్మకం ఉంది. ఎవరెన్ని చేసినా సరే. ఐ డోంట్ కేర్” అని ఆర్పీ చెప్పారు.
ALSO READ : అంబానీ వేడుకలకి టాలీవుడ్ నుండి “రామ్ చరణ్” ఒక్కరినే ఎందుకు పిలిచారు..? కారణం ఏంటంటే..?
End of Article