వినరో భాగ్యం విష్ణు కథ చిత్రంతో భారీ హిట్ కొట్టిన యువ హీరో కిరణ్ అబ్బవరం మంచి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మీటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ద్వారా రమేష్ కోడూరి అనే డైరెక్టర్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తొలిసారి పోలీస్ పాత్రలో మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు కిరణ్ అబ్బవరం.

Video Advertisement

మీటర్ సినిమా టీజర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ రావడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. మీటర్ పాటలు, సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాపై హైప్ పెరిగింది. కానీ ఈ మూవీ అన్ని రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగే ఉండటం తో మిక్స్డ్ టాక్ వస్తోంది. మీటర్ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ముందు అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువగానే అయిందని నిర్మాతలు గతం లోనే వెల్లడించారు. అయితే ఈ మూవీ కి ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 4.5 కోట్లుగా అంచనా వేశారు.

kiran abbavaram's meter movie collections..!!

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా భారీగానే కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. ప్రపంచవ్యాప్తంగా కనీసం 4.5 కోట్ల షేర్, 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మొదటి రోజు కోటి రూపాయలకు లోపే షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద మూడు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లు వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. ఇక వీకెండ్ లో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

kiran abbavaram's meter movie collections..!!

హీరో కిరణ్ అబ్బవరం మాస్ ఇమేజ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. గత సినిమాల్లో కాస్తోకూస్తే ఉన్న మాస్ డోస్ ఇందులో పెంచాడు. యాక్షన్ సీన్స్ లో మంచి ఎనర్జీతో కనిపించాడు. ఇప్పటివరకు మంచి కథలనే ఎంచుకున్న అతడు.. ఈ సినిమా విషయం లో తప్పటడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఇక నుండి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత తొందరగా ఎదిగాడో, అంతే తొందరగా కిందకి పడిపోతాడని అంటున్నారు.