బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమా రీమేక్. ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ మూవీ కథకి బాలీవుడ్ నేటివిటీ కి తగ్గట్టు ఎన్నో మార్పులు చేసారు.

Video Advertisement

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే పూజా హెగ్డే అన్నయ్య పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, అలాగే వదినగా భూమిక నటిస్తున్నారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.

umair sandhu review on salman khan's kisikabhaikisikajaan..!!

సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో దాదాపు 90 శాతం ఈద్ సెంటిమెంట్ ని ఫాలో అయ్యారు. ప్రతి సంవత్సరం రంజాన్ కి గ్యారంటీ గా తన సినిమా రిలీజ్ ఉండేలా ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ సంవత్సరం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో ఈద్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు సల్మాన్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఒకటి వైరల్ గా మారింది.

umair sandhu review on salman khan's kisikabhaikisikajaan..!!

దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు సల్మాన్ లేటెస్ట్ మూవీ రివ్యూ చెప్పేసారు. ” సల్మాన్ లేటెస్ట్ ఫామిలీ ఎంటర్టైనర్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చాల బోరింగ్ గా ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే సరిగ్గా లేవు. పాటలు అస్సలు బాగోలేదు. పూజా హెగ్డే చాలా చిరాకు తెప్పించింది.” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసారు. అలాగే ఈ మూవీ కి 2 స్టార్ రేటింగ్ ఇచ్చాడాయన.

umair sandhu review on salman khan's kisikabhaikisikajaan..!!

ఇక మరోవైపు ఈ సారి సౌత్ మార్కెట్ ని కూడా గట్టిగా ఫోకస్ చేసి రిలీజ్ చేస్తున్నాడు సల్మాన్. ఇప్పటికే ఇందులో చాలా మంది సౌత్ స్టార్స్ నటిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా, వెంకటేష్, చరణ్ గెస్ట్ అప్పీరెన్స్, జగపతిబాబు విలన్ గా.. బతుకమ్మ సాంగ్ తో సౌత్ మార్కెట్ ని బాగానే టార్గెట్ చేశారు. కానీ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.