Ads
ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో నిలిచిన సాంగ్ ఏది అంటే..’జంబలకడి జారు మిఠాయ’ సాంగ్. జానపదాలకు ప్రస్తుత తరం దూరం అవుతున్న నేపథ్యం లో తమ ఊరికి చెందిన ఇద్దరు సింగర్స్ ని వెలుగులోకి తెచ్చారు మోహన్ వారి పాటలను మంచు విష్ణు తన చిత్రం లో పెట్టుకున్నాడు. అదే ‘జంబలకడి జారు మిఠాయ’ పాట. అయితే ఈ జారు మిఠాయను పక్కన పెడితే మన చిన్న తనం లో మనకెంతో ఇష్టమైన చిరు తిండి ‘జారు మిఠాయ’ గురించి మీకు తెలుసా..? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం…
Video Advertisement
మన చిన్నతనం లో మన స్కూల్ ముందు, లేదా ఏవైనా తిరునాళ్ళు జరుగుతున్న ప్రదేశాల్లో ఈ జారు మిఠాయిలని అమ్మేవాళ్ళు. వీటిని తీగ మిఠాయి అని కొన్ని ప్రాంతాల్లో, బొంబాయి మిఠాయి అని కొన్ని ప్రాంతాల్లో పిలుచుకుంటారు. అప్పట్లో పిల్లలంతా ఈ క్యాండీ ని చాలా ఇష్టం గా తినేవాళ్లు. ఒక కర్రకు ఈ క్యాండీ ని చుట్టుకొని.. వాటిపై దుమ్ము పడకుండా ఒక కవర్ కానీ, లేదంటే పిల్లలను ఆకర్షించడానికి ఒక బొమ్మని గానీ పెట్టి వచ్చేవాళ్ళు. వారి చుట్టూ పిల్లలంతా మూగిపోయి ఆ తీగ మిఠాయి ని కొనుక్కొనేవారు.
ఈ మిఠాయిని పిల్లలు కోరుకున్న ఆకారాల్లో తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఆ చిరు వ్యాపారులు. అది కేవలం ఒక వ్యాపారమే కాకుండా ఒక సృజనాత్మక కళ. ఎక్కువగా పిల్లలు వాచీలు, ఉంగరాలు, గొలుసులు చేయించుకొని వాటిని ధరించే తినేవారు. అదొక మధుర జ్ఞాపకం. ఇవే కాకుండా నెమలి, పువ్వులు,కోడిపుంజు, లాకెట్ వంటి ఆకారాల్లో చేసి ఒక పుల్లకి గుచ్చి పిల్లలకు ఇచ్చేవారు. వాటిని ఆ పిల్లలు ఎంతో మురిపెంగా కరిగే వరకు చప్పరిస్తూ తినేవారు.
ప్రస్తుతం ఇవి ఏ షాప్స్ లోను దొరకట్లేదు. వీటిని పంచదార పాకం తో చేసేవారు. ఈ పాకం గడ్డ కట్టకుండా కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసి … వాటికి ఫుడ్ కలర్స్ కలిపి ఈ తీగ మిఠాయిలను తయారు చేసేవారు.
End of Article