రైలులో “మిడిల్‌ బెర్త్‌” కు సంబంధించిన ఈ రూల్ తెలుసా..? లేదంటే చిక్కులు తప్పవు..!

రైలులో “మిడిల్‌ బెర్త్‌” కు సంబంధించిన ఈ రూల్ తెలుసా..? లేదంటే చిక్కులు తప్పవు..!

by kavitha

Ads

లక్షలాది మంది ప్రతి రోజూ రైలులో ప్రయాణిస్తుంటారు. దూర ప్రాంతాలకు రైలులో ప్రయాణించేవారు సీటు విషయంలో ఇబ్బంది పడకుండా స్లీపర్ సెక్షన్‌లో ఎక్కువగా బుక్ చేసుకుని ప్రయాణిస్తుంటారు.

Video Advertisement

ఈ క్రమంలో ఎక్కువ మంది లోయర్ బెర్త్ కానీ,  అప్పర్ బెర్త్ కానీ, సైడ్ బెర్త్‌లను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే మిడిల్ బెర్త్‌ ను తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరు. దానికి కారణం ఇండియన్ రైల్వే తీసుకువచ్చిన మిడిల్ బెర్త్‌ రూల్. అయితే ఆ రూల్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గత ఏడాది ఇండియన్ రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్స్ ను ప్రకటించింది. రైలులో ప్రయాణం చేసే సమయంలో  ప్రయాణికులు ఈ రూల్స్ ను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. తరచూగా  రైలులో ప్రయాణం చేసేవారు, రైలు లో లాంగ్ జర్నీ వెళ్లాలనుకునేవారు ఈ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలి. ఇండియన్ రైల్వే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించాలానే ఉద్దేశ్యంతో ఈ రూల్స్ ను ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారికి ఈ రూల్స్ ఎక్కువగా వర్తిస్తాయి. ఈ కొత్త నియమనిబంధనలు పాటించనట్లయితే ప్రయాణికులు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో బెర్త్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారీ అనుకున్న ప్రకారం సీటు దొరకకపోవచ్చు. ఇక రైలులో మిడిల్‌ బెర్త్‌ దొరికితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి లోయర్ బెర్త్‌లు ఉన్న ప్రయాణికులు అర్థరాత్రి వరకు కూర్చుంటారు. అటువంటి పరిస్థితిలో, మిడిల్ బెర్త్ కలిగిన ప్రయాణికుడు తప్పనిసరిగా మిడిల్ బెర్త్ నియమాన్ని తెలుసుకోవాలి.మిడిల్ బెర్త్ రూల్: 

రైలులో ఇక సాధారణంగా పగటి పూట మిడిల్ బెర్త్‌ ప్రయాణికుడు దానిని కూర్చోవడానికి లేదా పడుకోవడానికి ఉపయోగించలేరు. ఇండియన్  రైల్వే రూల్స్  ప్రకారంగా  మిడిల్ బెర్త్ ప్రయాణికుడు మిడిల్ బెర్‌పై రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే పడుకోవడానికి అనుమతి ఉంటుంది. ఆ ప్రయాణికుడు అలసిపోయి పగటి సమయంలో నిద్రపోవాలంటే రాత్రి పది గంటల వరకు కూర్చుని ఉండాలి. ఒకవేళ మిడిల్ బెర్త్ ప్రయాణికుడు ఈ రూల్ ను పాటించకపోతే  రైల్వే శాఖ ఆ ప్రయాణికుది పై చర్యలు తీసుకోవచ్చు.

Also read: డీజిల్ రైలుఎంత మైలేజీని ఇస్తుందో తెలుసా? ఒక కిలో మీటర్ దూరం రైలు ప్రయాణిస్తే డీజిల్ ఎంత ఖర్చవుతుందంటే..


End of Article

You may also like