మెలోడి బ్రహ్మ మణిశర్మపేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలందరితోనూ మణిశర్మ పనిచేశారు. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లు అందించారు. 200కు పైగా సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్‌గా, సంగీత దర్శకుడిగా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి ‘చూడాలనివుంది’ సినిమాతో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన మణిశర్మ.. తెలుగులో స్టార్ మ్యూజిక్ కంపోజర్‌గా ఎదిగారు.

Video Advertisement

 

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మణి.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో వచ్చిన ‘ఆచార్య’ చిత్రానికి సంగీతం అందించారు. అయితే తాజాగా అలీ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఒక కార్యక్రమం లో పాల్గొన్న మణిశర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

know these facts about mani sharma..!!

మణిశర్మ అసలు పేరు నమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. స్క్రీన్ కోసం మణి శర్మగా మార్చుకున్నట్టు చెప్పారు. ఆయన తల్లిదండ్రులది పశ్చిమ గోదావరి జిల్లా పొడగట్ల పల్లి. ఇక ఐదురుగు సంతానంలో చిన్నవాడైన మణిశర్మ పుట్టి పెరిగింది చెన్నెలోనే అని చెప్పారు. ఇప్పటి వరకు 200 వరకు పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసినట్టు చెప్పారు. ఇక తమిళంలో 25 చిత్రాలు. కన్నడలో కొన్ని సినిమాలకు సంగీతం అందించినట్టు చెప్పుకొచ్చారు మణిశర్మ.

know these facts about mani sharma..!!

మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ ఏవీఎస్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ డి.రామానాయుడు నిర్మించిన ‘సూపర్ హీరోస్’. ఇక ఆర్జీవి దర్శకత్వంలో తెరకెక్కరిన ‘రాత్రి’ ‘అంతం’ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన విషయాన్నీ తెలిపారు మణిశర్మ. ఒకానొక సమయం లో కీ బోర్డ్ ప్లేయర్‌గా మన దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నానని ఆయన తెలిపారు.

 

know these facts about mani sharma..!!

గత కొంత కాలం గా కుర్ర సంగీత ద‌ర్శ‌కుల తాకిడి తాళలేక కాస్త జోరు త‌గ్గించాడు మ‌ణిశ‌ర్మ‌. ఒక‌ప్ప‌ట్లా స్టార్ హీరోల సినిమాలు కాక‌పోయినా.. చిన్న సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. దేవీ జోరు తగ్గించడం.. తమన్ రొటీన్ అయిపోవడంతో మళ్లీ మణిశర్మ గుర్తుకొస్తున్నాడు. సీనియర్ హీరోలు కూడా కొందరు మణిశర్మతో తమ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు.