కొంతమంది హీరోయిన్లు ఒకటి, రెండు చిత్రాలతో సరిపెడతారు. గీతాంజలి హీరోయిన్ గిరిజా నుండి అద్భుతమైన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లలో అందాల నటి గ్రేసీ సింగ్ కూడా ఒకరు. హీరో అక్కినేని నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటి సంతోషం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున పక్కన శ్రియా, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా నటించింది.
Video Advertisement
గ్రేసీసింగ్ ‘సంతోషం’ సినిమాలో కాసేపు కనిపించినప్పటికి తన అందం, నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో గ్రేసీ సింగ్ పైన చిత్రీకరించిన ‘దేవుడే దిగివచ్చినా’ అనే సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. ఈ చిత్రంలో ఆమె నటన చూసి స్టార్ హీరోయిన్ గా మరిన్ని సినిమాల్లో చేస్తుందనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఆ తర్వాత మోహన్‌బాబు, శ్రీకాంత్ నటించిన ‘తప్పుచేసి పప్పు కూడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ లో అదే గ్రేసీ సింగ్ కు చివరి సినిమా.
హిందీ, మలయాళం, తమిళ, పంజాబీ వంటి భాషల్లో ఆమెకు చిత్రాలలో అవకాశాలు రావడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఇక బాలీవుడ్ లో అమిర్‌ఖాన్ లగాన్, మున్నాబాయ్ ఎంబీబీఎస్, గంగాజల్ లాంటి విజయవంతమైన చిత్రాలలో గ్రేసీసింగ్ నటించింది. చాలా గ్యాప్ తరువాత రామ్ పోతినేని, అర్జున్ నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ పక్కన ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఆమె ఆఖరిసారి 2015లో ఒక పంజాబీ మూవీలో నటించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
ప్రస్తుతం గ్రేసీసింగ్ కి 42 సంవత్సరాలు. ఇంకా ఆమె వివాహం చేసుకోలేదట. గ్రేసీసింగ్ స్వతహాగా నృత్యకళాకారిణి అవడంతో ఆమె తన పేరుతో ‘గ్రేసీ సింగ్ డ్యాన్స్ ట్రూప్’ ని మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా నృత్య ప్రదర్శనలు ఇస్తోంది. అంతే కాకుండా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండట్లేదు ఈ భామ.
పండగల సమయాలలో మాత్రమే ఫొటోలను షేర్ చేస్తోంది. ఆమె ఇటీవల షేర్ చేసిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో గ్రేసీసింగ్ చాలా మారిపోయింది. బొద్దుగా అయినట్టు కనిపించింది. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Also Read: బలగం చిత్రంలో ‘సాయిలు’ పాత్రకు ముందు అనుకున్నది ప్రియదర్శి కాదంట.. ఆ నటుడు ఎవరంటే..