రకుల్ తో రొమాన్స్ కంటే.. గొర్రెలు కాయడం ఈజీ.. అంటున్న వైష్ణవ్ తేజ్..!

రకుల్ తో రొమాన్స్ కంటే.. గొర్రెలు కాయడం ఈజీ.. అంటున్న వైష్ణవ్ తేజ్..!

by Anudeep

Ads

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరో గా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన కొండపొలం సినిమా ఈరోజు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ నే అందుకుంది. రకుల్ ఈ సినిమాలో కొత్తగా కనిపించింది. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారట.

Video Advertisement

kondapolam

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ గొర్రెలను కాయాల్సి ఉంటుందట. అయితే.. గొర్రెలకాపరిగా నటించడానికి పెద్దగా ఇబ్బంది పడలేదని, కానీ రకుల్ ప్రీత్ తో రొమాంటిక్ సన్నివేశాలలో నటించేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. మొదటి సినిమా ఉప్పెనలో కూడా రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పటికీ.. కృతిశెట్టికి కూడా అది తొలి సినిమానే అవడంతో ఇబ్బందిపడలేదని.. కానీ, రకుల్ తనకంటే సీనియర్ అని, సీనియర్ తో రొమాంటిక్ సన్నివేశాలు అనేసరికి కొంచం ఇబ్బందిపడ్డానని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like