తెలుగులో లేడీ కమెడియన్ అనగానే గుర్తొచ్చే పేరు కోవై సరళ. తమిళనాడు లో పుట్టినా టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారామె. ముఖ్యం గా కోవై సరళ – బ్రహ్మానందం కాంబినేషన్ సూపర్ హిట్ కావడంతో వారు స్టార్ కామెడియన్లుగా మారిపోయారు. కొన్ని వందల సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

Video Advertisement

 

 

అయితే ప్రస్తుతం కోవై సరళ తెలుగు చిత్రాల్లో ఇకనిపించడం తక్కువైంది. తెలుగు లో ఆమెకు అవకాశాలు తగ్గాయో.. లేక ఆమే తెలుగుకి దూరం ఉంటుందో తెలియట్లేదు. అప్పుడప్పుడు కొన్ని కోలీవుడ్ చిత్రాల్లో ఆమె కనిపిస్తున్నారు. 2019 లో వచ్చిన అభినేత్రి మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె.. తాజాగా మరో చిత్రం తో వస్తున్నారు. ‘అరణ్య’ సినిమాతో టాలీవుడ్ లో కూడా పేరు సంపాదించుకున్నా ప్రభు సాల్మన్ తెరకెక్కించిన సీరియస్ మూవీ సెంబి చిత్రం లో కోవై సరళ నటించారు.

kovai sarala brillent acting in her new movie..!!

 

ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఆ సినిమా ఇటీవల తమిళంలో విడుదలైంది. ఈ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త షేడ్స్‌లో కోవై సరళను చూపించారు ప్రభు సాల్మన్. ఈ సినిమాలో కమర్షియల్ ఫ్లేవర్ లేకపోవడం వల్ల కామన్ ఆడియన్స్‌కి ఎక్కువగా కనెక్ట్ కాకపోవచ్చు అంటున్నారు. కానీ కోవై సరళ అయితే అదిరిపోయే నటనతో వావ్‌ అనిపించారు అని ఆమెకి, ఆమె నటనకి ప్రశంసలు వస్తున్నాయి.

kovai sarala brillent acting in her new movie..!!

ఈ చిత్రం లో వైవిధ్యమైన మేకప్‌తో కోవై సరళ అద్భుతం గా నటించారు. ఇన్నాళ్లు కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఈ చిత్రం లో సీరియస్ గా ఉండే 70 ఏళ్ళ వృద్ధురాలి పాత్ర లో నటించారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏ విధంగా వాడుకుంటారో అనే పాయింట్ పై ఈ చిత్రం వచ్చింది. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన కమల్ హాసన్ కోవై సరళ ని మెచ్చుకున్నారు. ఆమెకి అభినందనలు తెలిపారు.