“కృష్ణ” రెండో పెళ్లికి… “ఇందిరా దేవి” పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా..??

సూప‌ర్ స్టార్ కృష్ణ ఇంట్లో వ‌రుస విషాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గ‌తేడాది కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా కృష్ణ మొద‌టి భార్య, మ‌హేశ్ బాబు త‌ల్లి ఇందిరా దేవి సైతం అనారోగ్యంతో క‌న్నుమూశారు.
నిన్న ఉదయం కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలను నిర్వహించగా… ఇప్పుడు ఆమె లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

krisha wife indiradevi conditions to his second marriage
కృష్ణ స‌తీమ‌ణి అన‌గానే అంద‌రికీ విజ‌య‌నిర్మ‌ల గుర్తుకువ‌స్తారు. కృష్ణ మొద‌ట ఇందిరాదేవిని వివాహం చేసుకోగా ఆ త‌రవాత త‌న కోస్టార్ అయిన విజ‌య నిర్మ‌ల‌ను వివాహం చేసుకున్నారు. కృష్ణకు కుటుంబ స‌భ్యులు సినిమాల్లోకి రాక‌ముందే మేన కోడలు అయిన ఇందిరాదేవితో వివాహం జ‌రిపించారు. వీరికి అయిదుగురు సంతానం.

krisha wife indiradevi conditions to his second marriage
కృష్ణ… విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే ఇందిరా దేవి గారు ఎక్కడా హడావుడి చేయలేదు. అయితే కృష్ణ తో విడాకులు తీసుకోకుండానే ఆమె పిల్లల బాధ్యతలు చూసుకోవడం జరిగింది.
ఇక కృష్ణ విజ‌య నిర్మ‌ల‌తో పలు సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించారు. సినిమాలు చేస్తున్న క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. 1969 లో కృష్ణ – విజయనిర్మల ఒక గుడిలో పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనం. ఆ విష‌యాన్ని ఇందిరాదేవికి చెప్పగా ఆమె ఏమీ మాట్లాడ‌కుండా అలాగే ఉండిపోయార‌ట‌. కృష్ణ మాట‌ను ఆమె గౌర‌వించార‌ట‌. ఎలాంటి గొడ‌వ చేయ‌కుండా మౌన‌మే అర్థాంగికారం అన్న‌ట్టుగా ఉండిపోయార‌ట‌.

krisha wife indiradevi conditions to his second marriage
కృష్ణ రెండో వివాహం చేసుకున్న‌ప్ప‌టికీ ఇందిరా దేవి మాత్రం ఆయ‌న‌తో విడిపోలేదు. అంతే కాకుండా త‌న కుటుంబాన్ని చూసుకుంటూ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇక ఏ సినిమా ఫంక్ష‌న్ అయినా విజ‌య నిర్మ‌ల కృష్ణ క‌లిసి వ‌చ్చేవారు. అంతే కాకుండా ఇందిరాదేవి కూడా విజ‌య‌నిర్మ‌ల‌తో మాట్లాడేవారు. ఫంక్ష‌న్ ల‌లో ఇద్ద‌రూ క‌లుసుకునేవారు.

krisha wife indiradevi conditions to his second marriage
ఇక కృష్ణకు విజయ నిర్మల వెన్నుముఖ అని తెలుసుకున్న ఇందిరా దేవి ఒప్పుకున్నారు గాని… విజయ నిర్మలతో పిల్లలను కనడానికి మాత్రం నో చెప్పారు. ఆ కండీషన్ తోనే పెళ్లి చేసుకున్నారు.