రెమ్యూనరేషన్ విషయం లో కృష్ణ ఎలా ఉండే వారంటే..!!

రెమ్యూనరేషన్ విషయం లో కృష్ణ ఎలా ఉండే వారంటే..!!

by Anudeep

Ads

సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త సినీ, రాజకీయ ప్రముఖులను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తెలుగువారి అల్లూరి సీతారామరాజు అయిన సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యల వల్ల తుదిశ్వాస విడిచారు. ఎందరికో సాధ్యం కానీ ఎన్నో రికార్డులను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.

Video Advertisement

హీరోగా కృష్ణ నటించిన తొలి సినిమా తేనె మనసులు. ఆ చిత్రానికి ఆయన పారితోషికం 2000 రూపాయలు. 1965 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాతో హీరోగా మంచి పేరును సొంతం చేసుకున్న కృష్ణ ఆ తర్వాత కెరీర్ విషయంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఒక దశలో కృష్ణ సినిమాలు వరుసగా సక్సెస్ సాధించగా చాలామంది దర్శకులు రెమ్యునరేషన్ ను పెంచాలని సూచనలు చేసినా కృష్ణ మాత్రం రెమ్యునరేషన్ ను పెంచలేదు.

famous personalities died in 2022

దాదాపుగా 40 సినిమాలకు కృష్ణ 5000 రూపాయల చొప్పున పారితోషికం అందుకున్నారు. అప్పట్లో 5000 రూపాయల రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కు సమానం కాగా కృష్ణ మాత్రం తన సినిమాల ద్వారా నిర్మాతలకు బెనిఫిట్ కలిగితే చాలని భావించేవారు. తను హీరోగా నటించిన సినిమా ద్వారా నిర్మాత నష్టపోతే కృష్ణ వెంటనే ఆ నిర్మాతకు మరో ఛాన్స్ ఇవ్వడంతో పాటు నిర్మాతకు ఆర్థికంగా బెనిఫిట్ కలిగేలా తన వంతు సహాయసహకారాలు అందించేవారు.

famous personalities died in 2022

దర్శకులు మాత్రమే కాదు నిర్మాతల పాలిట కల్పవృక్షం.. మంచి మనసున్న వ్యక్తి కృష్ణ. కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేసిన కృష్ణ ఆ సహాయాల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడలేదు.


End of Article

You may also like