ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో ల పుట్టినరోజు.. స్పెషల్ డేస్ సందర్భంగా పలు హిట్ చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఒక్కడు, జల్సా, ఖుషి, నువ్వే నువ్వే వంటి హిట్ చిత్రాలు మళ్లీ విడుదలై మంచి వసూళ్లు రాబట్టాయి. అయితే తాజాగా ఒక నెటిజన్ దర్శకుడు కృష్ణ వంశీ ని ‘సింధూరం’ సినిమాని రీ రిలీజ్ చెయ్యమని అడిగాడు. దానికి కృష్ణ వంశీ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Video Advertisement

మాస్ మాహారాజా రవితేజ, సంఘవి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం సింధూరం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో న్యాచురల్ గా తెరకెక్కించిన ఈ సినిమా 1997 సెప్టెంబర్ 12న విడుదలై పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా భారీగా నష్టాలు మిగిల్చింది. అయితే దానికి ముందు వచ్చిన నిన్నే పెళ్లాడతా చిత్రం సూపర్ హిట్ కావడం తో దాని ప్రభావం కూడా ఈ చిత్రం పై పడింది.

krishna vamsi rection to sindhooram movie re release..!!

కృష్ణవంశీ మొదటి చిత్రం ‘గులాబీ’ తో అందరి మనసులు దోచుకున్నాడు. తర్వాత వచ్చిన నిన్నే పెళ్లాడుతా చిత్రం సూపర్ హిట్ కావడంతో అతడితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. కానీ కృష్ణవంశీ ‘సింధూరం’ కథని కృష్ణవంశీ నమ్మాడు. కానీ అతని అంచనాలు తలకిందులయ్యాయి. ఈ చిత్రానికి ఒక ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు కృష్ణవంశీ. దీంతో ఈ మూవీ మిగిల్చిన నష్టాల్ని తీర్చేందుకు కృష్ణవంశీకి ఐదేళ్లు పట్టిందట. ఇదే విషయాన్ని ఈ డైరెక్టర్ తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నాడు.

krishna vamsi rection to sindhooram movie re release..!!

ఇక తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా.. “కృష్ణవంశీ గారు ఒక్కసారి సింధూరం సినిమా రిలీజైతే నా లాంటి చాలామంది 4 షోస్ చూడటానికి సిద్ధంగా ఉన్నాము సార్.. ..”నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా సిందూరం”..మరణం లోపు మరల మరల చూడాలనిపించిన చిత్రం, వినాలి అనిపించే సంగీతం. ” అంటూ ట్వీట్ చేశారు. అయితే అతడి రిక్వెస్ట్ కు కృష్ణవంశీ స్పందించారు. “అమ్మో ఈ సినిమా కోసం చేసిన అప్పులు ఐదేళ్లు కట్టానయ్యా.. వామ్మో..” అంటూ దండం పెట్టేశాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ వైరలవుతున్నాయి. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, అనసూయ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.