Ads
రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రౌద్ర రసం పండించాలన్నా.. భక్తుడిగా మెప్పించాలన్న ఆయన తర్వాతే ఎవరైనా.. ఆరు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి కృష్ణంరాజు అనారోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజుల క్రితం మృతి చెందారు.
Video Advertisement
కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా చేసిన ఆయన, తర్వాత హీరో గా మెప్పించారు. ఆయన చివరి సారిగా ప్రభాస్ తో కలిసి ‘ రాధే శ్యామ్’ చిత్రంలో నటించారు. ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఈయన వ్యక్తిగత విషయాలకు వస్తే ఈయనకు రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య సీతాదేవి. ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు ప్రశాంతి. తర్వాత ఒక ప్రమాదంలో సీతాదేవి గారు మరణిస్తే.. శ్యామల దేవి అనే ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి.
కృష్ణంరాజు పుత్ర సంతానం కోసం ఎన్నో పూజలు యాగాలు చేశారట. పుత్ర సంతానం కోసం ఈయన పుత్రకామేష్టి యాగం కూడా చేశారట. కొడుకు కోసం యాగం చేసినప్పటికీ ఈయనకు యాగ ఫలితం దక్కలేదని అందుకే ముగ్గురు కూతుర్లు జన్మించారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తనకు వారసులు లేరని కృష్ణం రాజు గారు కొన్నాళ్ళు బాధపపడ్డారట.. తర్వాత కృష్ణం రాజు గారు తన సోదరుడి కుమారుడు ప్రభాస్ ను తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసారు. అప్పటినుంచి ఈయన ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అనంతరం ప్రభాస్ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఇలా ఈయన ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందడంతో ఆయన ఎదుగుదలను చూసి కృష్ణంరాజు ఎంతో సంతోషపడే వారట. ఇలా ప్రభాస్ ఎదుగుదల అనంతరం తనకు వారసులు లేరు అనే లోటు కూడా తీరిపోయిందని, ప్రభాస్ ఎదుగుదలను ఈయన ఎంజాయ్ చేస్తూ తనని ప్రోత్సహిస్తూ ఉండేవారు.
End of Article