పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ డేటింగ్ చేస్తుంద‌ని, త్వ‌ర‌లోనే వారిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. దానికి త‌గ్గ‌ట్టు హీరో వ‌రుణ్ ధావ‌న్ చేసిన కామెంట్స్ కూడా బ‌లాన్ని చేకూర్చాయి. కృతి స‌న‌న్ మ‌న‌సు బాలీవుడ్‌లో లేదంటూ ద‌క్షిణాది హీరోతో ఆమె ప్రేమ‌లో ఉందంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన మాట‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి.

Video Advertisement

 

అయితే ప్ర‌భాస్‌తో డేటింగ్‌, పెళ్లి వార్త‌ల‌పై కృతి స‌న‌న్ రియాక్ట్ అయ్యింది. త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా కృతి స‌న‌న్ ప్ర‌భాస్‌తో తాను డేటింగ్ చేస్తున్నాన‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండింది. త‌న డేటింగ్ పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, అవ‌న్నీ ఆధారం లేని వార్త‌లంటూ కొట్టి పారేసింది.

kriti sanon reacts about the rumours with prabhas..

తోడేలు సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో వ‌రుణ్ ధావ‌న్ చేసిన టీజింగ్ కార‌ణంగా కృతి స‌న‌న్ తాను ప్ర‌భాస్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు రూమ‌ర్స్ వ‌చ్చాయని తెలియ‌జేసింది. ప్ర‌భాస్‌తో తన‌కున్న స్నేహాన్ని ఇంకేదోలా చూపిస్తున్న రూమర్స్‌కి ఆమె చెక్ పెట్టేసింది.

kriti sanon reacts about the rumours with prabhas..

తెలుగులో వ‌న్ నేనొక్క‌డినే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కృతి స‌న‌న్ త‌ర్వాత హిందీలోనే వ‌రుస సినిమాలు చేస్తుంది. చాలా గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్ స్టార్ ప్ర‌భాస్‌తో క‌లిసి పాన్ ఇండియా మూవీ ఆది పురుష్‌లో న‌టించింది. అందులో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తే.. కృతి స‌న‌న్ సీత పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.