టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. చేతి నిండా బిగ్ ప్రాజెక్టులతో ఉన్నాడు. అయితే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హీరో ప్రభాస్‌, హీరోయిన్ కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నదంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Video Advertisement

 

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ నటిస్తోంది. అయితే ఆదిపురుష్ టీజర్ లాంచ్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వీరి డేటింగ్ పుకార్లకు ఆజ్యం పోసింది. వీరిద్దరినీ అలా చూసిన ఫ్యాన్స్.. జంట చూడముచ్చటగా ఉంది అంటూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

kritisanon comments on prabhas goes viral..

అయితే తాజాగా మరోసారి ఈ జంట చర్చల్లో నిలిచింది. ప్ర‌స్తుతం వ‌రుణ్ ధావ‌న్‌, కృతి స‌న‌న్ క‌లిసి బేడియా సినిమాలో న‌టించారు. ఆ సినిమాకు సంబంధించిన ఓ ఇంట‌ర్వ్యూలో కృతి స‌న‌న్‌కి కార్తీక్ ఆర్య‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్‌, ప్ర‌భాస్‌.. ముగ్గురు హీరోల‌ను ఆప్ష‌న్‌గా ఇచ్చి వీరిలో ఎవ‌రిని పెళ్లి చేసుకుంటావు, ఎవ‌రితో డేటింగ్ చేస్తావు.. ఎవ‌రిని ఫ్ల‌ర్ట్ చేస్తావు అని అడిగారు. దానికి కృతి కార్తీక్ ఆర్య‌న్‌ను ఫ్లర్ట్ చేస్తాన‌ని, టైగ‌ర్ ష్రాప్‌తో డేట్‌కి వెళ‌తాన‌ని, ప్ర‌భాస్‌ని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది.

kritisanon comments on prabhas goes viral..

ఇంత‌కు ముందు ప్ర‌భాస్‌, అనుష్క మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డిచింద‌ని, వారిద్ద‌రూ పెళ్లి చేసుకుంటారంటూ వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆది పురుష్ త‌ర్వాత ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ మ‌ధ్య ల‌వ్ ఉందంటూ వార్త‌లు వ‌చ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

kritisanon comments on prabhas goes viral..

‘ఆదిపురుష్’ విజువల్ ఎఫెక్ట్స్‌పై ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా.. టీజర్‌లో కృతి, ప్రభాస్ కనిపించిన సీన్‌పై మాత్రం చాలా మంది మనసు పారేసుకున్నారు. ఆ విజువల్ చాలా బాగుందంటూ కొనియాడుతున్నారు. ప్రభాస్, కృతి జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకి రానుంది.