‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయ్యింది తుళు అందం కృతి శెట్టి. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా మారింది. అయితే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న ఆమెకు తర్వాత రోజుల్లో హ్యాట్రిక్ ఫ్లాపులు షాకిచ్చాయి. ది వారియర్, మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే వరుసగా ఫ్లాప్స్ పడడంతో ఇక ఈ భామకు రెమ్యూనరేషన్ తగ్గించారట నిర్మాతలు.
Video Advertisement
ఉప్పెన సినిమాకు రూ.6 లక్షలు పారితోషికం అందుకున్న ఈ బ్యూటీ రెండో సినిమాకి రూ.60 లక్షలు డిమాండ్ చేసింది. అటు తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు హిట్ అవ్వడంతో కృతి శెట్టి కోటి రూపాయల వరకు డిమాండ్ చేసిందిట. నిర్మాతలు కూడా ఓకే అనడంతో కోటీ రూపాయల హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ చిత్రాలకు ఆమె కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుందట. కానీ ఇప్పుడు సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ కావడం తో రెమ్యూనరేషన్ తగ్గించినట్లు సమాచారం.
రెమ్యూనరేషన్ తగ్గించాలని నిర్మాతలు కోరడం తో ఈ భామ కూడా తగ్గించేసిందని తెలుస్తోంది. అయితే మరో సినిమా హిట్ అయితే మళ్లీ కోటి రూపాయలు అందుకునే అవకాశం కూడా ఉందని.. ఇక ఈసారైన ఆమెకు హిట్ పడాలనీ కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. ప్రస్తుతం కృతి.. శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్యకు జోడీగా కస్టడీ సినిమాలో కృతిశెట్టి నటిస్తుండగా ఈ రెండు చిత్రాల ఫలితంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు వస్తాయో లేదో డిసైడ్ కానుంది.
ఇంకో సినిమా కనుక ప్లాప్ అయితే ఆమె కెరీర్ డేంజర్‌లో పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక వరుసగా సినిమాలు ఫ్లాప్స్ అవ్వడంతో కృతి శెట్టి కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఉప్పెన హిట్ తర్వాత వరుసగా సినిమాలను చేసి అంతే వరుసగా ఫ్లాప్స్‌ను మూట గట్టుకుంది కృతి శెట్టి. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని రోజుల వరకు కొత్త సినిమాలను ఒప్పుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు కృతిశెట్టికి ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది స్టార్ హీరోలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. తమ పక్కన కృతిశెట్టి చిన్నపిల్లలా కనిపిస్తుందని ఆ హీరోలు చెప్పినట్టు సమాచారం.