ఎలాంటి సర్పదోషాలున్నా సరే…ఈ గుడికి వెళ్తే అన్ని పోతాయి.! అక్కడ ఇచ్చే మట్టి ప్రసాదాన్ని ఏం చేయాలంటే.?

ఎలాంటి సర్పదోషాలున్నా సరే…ఈ గుడికి వెళ్తే అన్ని పోతాయి.! అక్కడ ఇచ్చే మట్టి ప్రసాదాన్ని ఏం చేయాలంటే.?

by Harika

Ads

కాలసర్ప దోషాలతో బాధపడేవారు కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో నాగదేవత పరిహారం చేయించుకొని మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. నాగదోష పరిహారాలకి చాలా ప్రసిద్ధమైనది ఈ క్షేత్రం. ఇక్కడ ప్రధానంగా సర్పహత్యాదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగ ప్రతిష్ట పూజలు చాలా నిష్టగా నిర్వహిస్తారు. అన్ని ఆలయాలలోని పళ్ళు, పువ్వులు మొదలైనవి ప్రసాదంగా ఇస్తారు.

Video Advertisement

కానీ ఈ ఆలయంలో వల్మిక మృత్తిక అంటే పుట్టమన్ను ప్రసాదంగా ఇస్తారు.అక్కడే కాదు ఉడిపి సమీపంలో ఉన్న నాగ బనగహళ్లి అనే ఊర్లో కూడా పుట్టమన్ను ప్రసాదంగా ఇస్తారు. అయితే చాలామందికి ఈ పుట్టమన్నుని ఏం చేయాలో తెలియదు. దాని మహిమాన్వితం కూడా ఎవరికి తెలియదు అయితే ఆ పుట్టమన్ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. పాములను చూసి భయపడేవాళ్లు ఈ పుట్టమన్నుని బొట్టుగా పెట్టుకుంటే సర్ప దోషం పోతుంది. అలాగే వారికి నాగదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది.

కొంతమంది అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు వారికి కొబ్బరి నూనెలో కొంచెం ఈ పుట్టమన్ను వేసి తల దువ్వుకుంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారు.అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. అలాగే ఋతు సమయంలో కడుపు నొప్పితో బాధపడే ఆడపిల్లలు ఋతుకాలానికి ముందు ఒక చిటికెడు మృతికను బాగా పొడి చేసుకుని ఆముదం లేదా కొబ్బరి నూనెలో వేసి పొట్టకు పూసుకుంటే పొట్ట నొప్పి ఉండదు. అలాగే చాలామంది పరీక్షల సమయంలో చదివినది మర్చిపోతూ ఉంటారు.వాళ్ళు ఒక చిటికెడు పుట్టమన్నుని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ గ్లాసులో నీటిని వడకట్టి తాగుతూ ఉంటే మంచి జ్ఞాపకశక్తి వస్తుంది.

అలాగే మంచి మార్కులతో పాస్ అవుతారు కూడా. వివాహం అయ్యి సంతాన భాగ్యం లేని వారు మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసిన తర్వాత దేవునికి ప్రసాదంగా పెట్టిన పాలలో ఒక చిటికెడు మృత్తిక వేసి దేవుడికి చూపించి ప్రార్థన చేసుకుని తాగితే స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది.


End of Article

You may also like