విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో విడుదలైన ఖుషి మూవీ మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది.‘నిన్ను కోరి’ ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ వంటి వినూత్నమైన కాన్సెప్ట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు వహించారు.

Video Advertisement

‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయింది.

kushi movie review

గత కొద్దికాలం గా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమంత ,విజయ్ దేవరకొండ ఇద్దరి కెరీర్లకు ఈ చిత్రం ఎంతో ముఖ్యమైనది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ ,టీజర్ తో పాటు పాటలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఈ చిత్రానికి మలయాళం మూవీ హృదయం ఫేమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సేమ్ టైటిల్ తో గ్రాండ్ గా విడుదల చేయడం జరిగింది.

మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో మూవీకి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.50.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఈ చిత్రం రూ.50.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా వరల్డ్ వైడ్ మొదటి రోజు కలెక్షన్స్ 14.96 కోట్లు షేర్ జమ చేసేసాయి. ఇక బ్రేక్ ఈవెన్ రూ.35.59 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉండగా వీకెండ్ కాబట్టి కచ్చితంగా ఈ టార్గెట్ సగం పైన ఆయన ఫినిష్ అవుతుంది అని చిత్ర బృందం అంచనా.

ALSO READ : స్కంద ట్రైలర్‌లో రామ్, శ్రీకాంత్ తో పాటు కనిపించిన… ఈ హీరో ఎవరో తెలుసా..?